
కర్నూల్:కర్నూల్ జిల్లా yemmiganur municipality chairman మున్సిపల్ చైర్మెన్ Raju తమపై దాడి చేశారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఎమ్మిగనూరు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కి కూడా ఫిర్యాదు చేశారు. గత 3 నెలలుగా కెఎస్ రాజు ఆస్తి కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తమ కొడుకుతో తమకు ప్రాణ భయం ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆస్తి కోసం తమపై దాడికి దిగారని రాజుపై తల్లి Saroja ఫిర్యాదు చేసింది.మూడు నెలలుగా తమతో పాటు కుటుంబ సభ్యులను కూడా రాజు వేధింపులకు గురి చేస్తున్నాడని, చిత్ర హింసలు పెడుతున్నాడని సరోజ ఆ ఫిర్యాదులో పేర్కొంది.
ఈ దాడి దృశ్యాలు సీసీటీవీ పుటేజీలో రికార్డయ్యాయి. ఈ సీసీటీవీ పుటేజీని కూడా బాధితురాలు పోలీసులకు అందించింది. అయితే ఈ విషయమై పోలీసులు ఎలాంటి చర్యలు తీసకొంటారోననేది ప్రస్తుతం సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. .ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మెన్ గా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాజు మున్సిపల్ చైర్మెున్ గా ఎన్నికయ్యారు. అయితే ఆస్తి కోసం కొడుకు చిత్రహింసలు పెడుతున్నారని సరోజ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహరం వెలుగు చూసింది.