మంత్రుల రాజీనామాకు డిమాండ్: నారా లోకేష్ పై రోజా సంచలన వ్యాఖ్యలు

By telugu teamFirst Published Jan 27, 2020, 10:57 AM IST
Highlights

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాగా బలిసిన కోడీిని కోసి ఉప్పూకారం చల్లి కూర వండుకుని తింటారని రోజా నారా లోకేష్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మండలిని రద్దు చేయాలని తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కోరుతానని ఆమె అన్నారు. టీడీపీ వైఖరి కారణంగానే శాసన మండల్లిలో విలువలు దెబ్బ తిన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. 

మండలి గ్యాలరీలో కూర్చుని చైర్మన్ బెదిరించి, తమకు అనుకూలంగా వ్యవహరించేలా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చూశారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాల్సిన పెద్దల సభ అభివృద్ధిని అడ్డుకుంటుంటే ఆ సభ ఉండాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు. 

Also Read: ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి కేబినెట్ ఆమోదం

చంద్రబాబు రాయలసీమ ప్రాంతాన్ని సర్వనాశనం చేశారని, ఇప్పుడు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు న్యాయ రాజధానిని పెట్టడానికి సిద్దపడితే అపహాస్యం చేస్తున్నారని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె నారా లోకేష్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ తీరు చూస్తుంటే చాలా విచిత్రంగా ఉందని, బయటకు వచ్చి ఏదో సాధించినట్లు శాసన మండలిని రద్దు చేస్తారా, దమ్ముంటే చేయండంటూ సవాల్ విసురుతున్నారని ఆమె ్న్నారు 

బాగా బలిసిన కోడి చికెన్ షాపు ముందుకెళ్లి తొడ కొడితే ఏమవుతుదని ఆమె నారా లోకేష్ ను ఉద్దేసించి అన్నారు. అటువంటి కోడిని కోసి ఉప్పూ కారం పెట్టి కూర వండేస్తారంటూ ఆమె వ్యాఖ్యానించారు. 

యనమల రామకృష్ణుడిపై కూడా ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యనమలను రెండుసార్లు, ఆయన తమ్ముడిని రెండు సార్లు ప్రజలు ఓడించారని ఆమె గుర్తు చేశారు. ప్రజలు జగన్ ను అత్యధిక మెజారిటీతో గెలిపిచారని, 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా అభివృద్ధి నిర్ణయాలను అమలు చేయలేకపోతే ఎలా అని ఆమె అన్నారు. రాష్ట్రాభివృద్దికి అడ్డు తగిలే దేన్నయినా పక్కకు తప్పించాల్సిందేనని రోజా అన్నారు. 

Also Read: అసెంబ్లీలో రింగ్ గీశాడు.. దాటితే గెంటేయమంటున్నాడు : జగన్‌పై బాబు ఫైర్

కాగా, శాసన మండలి రద్దుకు ముందు మంత్రులు ఇద్దరు రాజీనామా చేయాలని నారా లోకేష్ తాజాగా డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీలు ఏడుగురు కూడా రాజీనామా చేయాలని ఆయన అన్నారు.

click me!