ఆ శక్తి మోడీ ఒక్కరికే ఉంది.. అందుకే భాజపాతో కలిసా: పవన్

prashanth musti   | Asianet News
Published : Jan 27, 2020, 10:42 AM ISTUpdated : Jan 27, 2020, 10:47 AM IST
ఆ శక్తి మోడీ ఒక్కరికే ఉంది.. అందుకే భాజపాతో కలిసా: పవన్

సారాంశం

పవన్ కళ్యాణ్ మరోసారి భారత జనతా పార్టీ పై ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై కూడా పవన్ పాజిటివ్ కామెంట్స్ చేశారు. మోడీది బలమైన నాయకత్వమని అన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భారత జనతా పార్టీ పై ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై కూడా పవన్ పాజిటివ్ కామెంట్స్ చేశారు. మోడీది బలమైన నాయకత్వమని అన్నారు. భారతమాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నెక్ల్స్ రోడ్డులో మహాహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్ పజనసేన అధినేత తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.

also read: తప్పుడు ప్రచారంపై జనసేన సీరియస్.. పరువు నష్టం దావా

పవన్ మాట్లాడుతూ.. ''కేవలం దేశ సేవ చేయాలనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చాను. పదవులు ఆశించి కాదు. నేను మొదట ఒక భారతీయుణ్ణి.. చివర కూడా భారతీయుణ్ణి అనే గర్వపడుతున్నా.  ఎంతో మంది త్యాగఫలితాల కారణంగానే మనం నేడు ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రధాని మోడీ ఒక బలమైన నాయకుడు. ఆయనది బలమైన నాయకత్వం. శత్రు దేశాలను గజగజ వణికించే శక్తి ఆయనది.

also read:జనసేన పొత్తు ఎఫెక్ట్, పవన్ కల్యాణ్ తో దోస్తీ: కమెడియన్ అలీ అందుకే...

పాక్ లో హిందువులకు రక్షణ లేదు. ఊచకోత కోసే సెక్యులరిజం అవసరం లేదనేది నా భావన. భాజపాలో దేశాన్ని రక్షించే శక్తి ఉంది. అందుకే దేశ సేవ చేయాలని ఆ పార్టీతో కలిశాను. దేశ సేవలోకర్పూరంలా కరిగిపోవాలని ఉంది''. అని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, అష్టావధాని గరికపాటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?