ఇంతకీ, రాయలసీమలో ఏది ‘ఫీజిబుల్’ బాబూ ?

First Published Sep 8, 2017, 1:02 PM IST
Highlights

రాయలసీమనుంచి ఏ డిమాండ్ వచ్చినా ’ఫీజిబుల్ కాదు’ అని వస్తున్న సమాధానాన్ని అక్కడి విద్యార్థులు, యువకులు వ్యతిరేకిస్తున్నారు

రాయలసీమలో రెండుచోట్ల విద్యార్థులు, యువకులు ఉద్యమాలు చేస్తున్నారు.

అనంతపురం విశ్వవిద్యార్థులు గంతకల్లు రైల్వే డివిజన్  రైల్వే జోన్ గా మార్చండంటున్నారు. బాగా లాభాలలో ఉన్న డివిజన్ లలో ఇదొకటి. ఇక్కడ జోన్ వస్తే, ఎకనమిక్ యాక్టివిటి పెరుగుతుంది. వెనకబడిన ప్రాంతమయిన అనంతపురం జిల్లాకు , రాయలసీమకు మేలు జరుగుతుందనేది వారి వాదన. ఇపుడు మెల్లిగా నిరాహార దీక్షలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ధర్నాలు, ప్రదర్శనలు జరగుతున్నాయి. ఉద్యమం ఉధృతంచేయాలని అఖిల పక్షం సమావేశాలు నిర్వహిస్తున్నారు.

మరొకఉద్యమం, కడపస్టీల్ ప్లాంట్ ఉద్యమం. ఒక  ఏడాది కడప జిల్లా యువకులు, విద్యార్థులు జమ్మల మడుగు సమీపంలో  స్టీల్ ప్లాంట్ ఏర్పాటుచేయాలని స్టీల్ ప్లాంట్ సాధన సమితి ఏర్పాటుచేసుకుని ఏడాదిన్నరగా ఉద్యమం జరగుపున్నారు. స్టీల్ ప్లాంట్ వస్తే, స్టీల్ సిటి వస్తుంది, ఉద్యోగాలొస్తాయి, ఎకనమిక్ యాక్టివిటి పెరుగుతుంది. జీవనోపాధి లభిస్తుందనే కడప జిల్లా యువకుల వాదిస్తున్నారు. ఈనెల 11 న కడప ఉక్కు పోరాట కమిటీ వారు  బహిరంగ సభ కూడా ఏర్పాటుచేస్తున్నారు.

మూడేళ్లవుతున్నా,స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాటంటే ఒక్క మాట, ఆశాజనకమయిన మాట, ప్రభుత్వం నుంచి రావడం లేదు.

గుంతకల్ జోన్ గురించి అసలుప్రస్తావనేలు. ఈ రెండు ఫీజిబుల్ కావనేది ఏలిన వారు జవాబు.

నంద్యాలలో తెలుగుదేశం అఖండ విజయం సాధించాక కూడా ఈ యువకులనోరు మూతబడలేదు. ఎలా ఫీజిబుల్ కాదో చూస్తాం అంటున్నారు.

వాళ్ళడుతున్న ప్రశ్న ఇదే...

రాజధాని కర్నూలు లో ‘ఫీజిబుల్’ కాదు

హైకోర్ట్ సీమలో ‘ఫీజిబుల్’ కాదు

రైల్వేజోన్ గుంతకల్లులో ‘ఫీజిబుల్’ కాదు

ఎయిమ్స్ అనంతపురంలో‘ఫీజిబుల్’కాదు

పుష్కరాలు శ్రీశైలంలో ‘ఫీజిబుల్’కాదు

ఉక్కు పరిశ్రమ కడపలో ‘ఫీజిబుల్’ కాదు

మేజర్ పోర్ట్ దుగ్గరాజపట్నంలో‘ఫీజిబుల్’కాదు

స్మార్ట్ సిటీకి తిరుపతి ‘ఫీజిబుల్’ కాదు

మరి రాయలసీమకు ఏది ఫీజిబులో చెప్పండి

అన్నీ ‘ఆ’ రెండు జిల్లాల్లోనే ‘ఫీజిబుల్’ అవుతాయా

రాష్ట్రం రెండు జిల్లాల రాష్ట్రమా...

 

 

click me!