ఈవీఎం చోరీ కేసులో నిందితుడికి పదవి

Published : Sep 08, 2017, 12:11 PM ISTUpdated : Mar 24, 2018, 12:04 PM IST
ఈవీఎం చోరీ కేసులో నిందితుడికి పదవి

సారాంశం

మనవాడైతే చాలు అందలం ఎక్కించేయాలన్నట్లు తయారైంది చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో పరిస్ధితి.   వివిధ కేసుల్లో నిందుతులకు కుడా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం మొహమాటం లేకుండా పదవులను కట్టబెట్టేస్తోంది. ఇదంతా ఎందుకంటే, రియల్‌ టైమ్‌ గుడ్‌ గవర్ననెన్స్‌ కమిటీ(ఆర్‌టీజీసీ) సాంకేతిక సలహాదారుగా వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ నియామకం గురిందే. ప్రసాద్ ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేయగానే పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

మనవాడైతే చాలు అందలం ఎక్కించేయాలన్నట్లు తయారైంది చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో పరిస్ధితి.  వివిధ కేసుల్లో నిందుతులకు కుడా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం మొహమాటం లేకుండా పదవులను కట్టబెట్టేస్తోంది. పదవుల్లోకి వచ్చిన తర్వాత ఎవరిపైనైనా ఆరోపణలు వచ్చినా, కేసులు నమోదైనా వెంటనే వారిక ఉధ్వాసన పలికేవారు. కానీ కేసుల్లో నిందుతులకు కుడా పదవులు కట్టబెట్టటమన్నది కొంత సంప్రదాయంగా మారింది.

ఇదంతా ఎందుకంటే, రియల్‌ టైమ్‌ గుడ్‌ గవర్ననెన్స్‌ కమిటీ(ఆర్‌టీజీసీ) సాంకేతిక సలహాదారుగా వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ నియామకం గురిందే. ప్రసాద్ ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేయగానే పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈవీఎం చోరీ కేసులో నిందితుడైన ప్రసాద్‌ను ఆర్‌టీజీసీ సాంకేతిక సలహాదారుగా నియమించడంపై అధికార వర్గాలే విస్తుపోతున్నాయి.

చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడైన హరికృష్ణ ప్రసాద్‌ ఈవీఎంలను ట్యాంపర్‌ చేయటంపై 2010 ఏప్రిల్‌ 29 ఓ  టీవీ ఛానల్‌లో లైవ్‌ షో ఇచ్చారు. ఇందులో ప్రసాద్ వాడిన ఈవీఎంను మహారాష్ట్ర ఎన్నికల్లో వినియోగించారు. పూర్తి భద్రతతో స్ట్రాంగ్ గదుల్లో ఉండాల్సిన ఈవీఎం ప్రసాద్ వద్దకు ఎలా వచ్చిందో తెలీదు. ప్రసాద్ ఈవీఎంను అపహరించారంటూ ముంబై ఎన్నికల అధికారి 2010 మే 12న ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసేలా ప్రసాద్‌ వ్యవహరించిన తీరుపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

ప్రసాద్ పై కోర్టులో కేసు విచారణలో ఉంది. అటువంటిది ఆయన్ను ఏరి కోరి ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. ప్రసాద్‌ సోదరుడైన డాక్టర్‌ వేమూరి రవికుమార్‌ ప్రసాద్‌ను ప్రవాస తెలుగు ప్రజల వ్యవహారాల విభాగం సలహాదారుగా నియమించింది. వీరికి సంబంధించిన సంస్థకే ఫైబర్‌ గ్రిడ్, ఈ–ప్రగతి ప్రాజెక్టులను నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టి భారీ ఎత్తున లబ్ధిచేకూర్చారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.                        

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu