అమ్మాయిలతో అసభ్య నృత్యాల పార్టీ... సిసిఎస్ సీఐపై సస్పెన్షన్ వేటు

Arun Kumar P   | Asianet News
Published : Aug 04, 2021, 04:57 PM ISTUpdated : Aug 04, 2021, 04:59 PM IST
అమ్మాయిలతో అసభ్య నృత్యాల పార్టీ...  సిసిఎస్ సీఐపై సస్పెన్షన్ వేటు

సారాంశం

 అమ్మాయిలతో అసభ్య నృత్యాలతో ఏర్పాటుచేసిన పుట్టినరోజు పార్టీలో పాల్గొన్న గుంటూరు అర్బన్ సిసిఎస్ సీఐ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. 

గుంటూరు: అసాంఘిక, అసభ్య కార్యక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీస్ అధికారే అలాంటి గలీజ్ పనుల్లో పాల్గొని అడ్డంగా బుక్కయ్యాడు. ఇటీవల గుంటూరులో ఓ వ్యక్తి జన్మదినం సందర్భంగా ఏర్పాటుచేసిన రేవ్ పార్టీలో సీఐ పాల్గొని పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. పోలీస్ డిపార్ట్మెంట్ పరువుతీసే ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు సదరు సీఐ సస్పెండ్ చేశారు. 

వివరాల్లోకి వెళితే... గుంటూరు నగరంలోని ఇన్నర్‌ రింగు రోడ్డు సమీపంలో గల తెలుగింటి రుచులు రెస్టారెంట్‌లో గత సోమవారం రాకేష్‌ అనే వ్యక్తి  జన్మదిన వేడుకలు జరిగాయి. అయితే పార్టీలో భాగంగా తన స్నేహితులకు మందు పార్టీ ఏర్పాటుచేశాడు. ఇంతవరకూ భాగానే వున్నా మందేసిన స్నేహితులు కలిసి చిందేయడానికి విజయవాడ నుంచి ఆరుగురు యువతులను తీసుకువచ్చారు. ఇలా పార్టీకి వచ్చిన వారితో అమ్మాయిలు అసభ్యకరంగా నృత్యాలు చేశారు.  

VIDEO  గుంటూరులో డర్టీ కల్చర్... అర్ధరాత్రి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు 

పుట్టినరజు పార్టీ ముసుగులో జరుగుతున్న ఈ రేవ్ పార్టీపై పక్కా సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు హోటల్ పై దాడి చేధీరు. పార్టీలో పాల్గొన్నవారితో పాటు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ పార్టీలో అర్బన్‌ సీసీఎస్‌లో పనిచేస్తున్న సీఐ వెంకటేశ్వర రావు కూడా హాజరయ్యారు. దీంతో అతడిపై పోలీస్ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.   

కోవిడ్‌ నిబంధనలు అతిక్రమించటం, అధిక శబ్ధాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించడంతో పాటుగా మద్యం సేవించటం, అసభ్యకరమైన నృత్యాలు చేసినందుకు పట్టుబడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రేవ్ పార్టీకి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?