కరోనా థర్డ్‌వేవ్‌కీ మందు తయారు చేస్తా.. కొరియర్‌లో పంపుతా, కృష్ణపట్నం రావొద్దు: ఆనందయ్య

Siva Kodati |  
Published : Aug 04, 2021, 04:11 PM IST
కరోనా థర్డ్‌వేవ్‌కీ మందు తయారు చేస్తా.. కొరియర్‌లో పంపుతా, కృష్ణపట్నం రావొద్దు: ఆనందయ్య

సారాంశం

కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో దానికి కూడా మందు తయారు చేస్తానన్నారు కృష్ణపట్నం ఆనందయ్య. ఎవరికి మందు కావాలన్న కొరియర్ ద్వారా ఉచితంగానే పంపుతానని ఆయన స్పష్టం చేశారు.   

కరోనా మందుకు సంబంధించి కృష్ణపట్నం ఆనందయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఆయుర్వేద మందుకు ఎలాంటి పేరు పెట్టబోనని ఆయన స్పష్టం చేశారు. అది ఆనందయ్య మందుగానే అందరికీ పరిచయమైందని.. థర్డ్ వేవ్ లక్షణాలు చూసి దానికీ మందు తయారు చేస్తానని ఆనందయ్య వెల్లడించారు. ఎవరికి మందు కావాలన్న కొరియర్ ద్వారా ఉచితంగానే పంపుతానని ఆయన స్పష్టం చేశారు. 

కొద్దిరోజుల క్రితం ఆయన మాట్లాడుతూ.. కొందరు తన పేరున నకిలీ మందు తయారు చేసి విక్రయిస్తున్నారని ఆనందయ్య చెప్పారు. నకిలీ మందుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. అన్ని ప్రాంతాలకు తన మందు చేరిందన్నారు. తన మందును అన్ని ప్రాంతాలకు చేరేలా సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.  తన పేరున విక్రయించే నకిలీ మందు వికటిస్తే తాను బాధ్యుడిని కానని ఆయన చెప్పారు. ఈ విషయమై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

ALso Read:నా పేరుతో నకిలీ మందులు: ఆనందయ్య సంచలనం

ఆనందయ్య మందు  కోసం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున డిమాండ్ నెలకొన్న విషయం తెలిసిందే. ఆనందయ్య పంపిణీ చేసే  కంట్లో వేసే చుక్కల మందు హనికరమని ల్యాబ్ రిపోర్టులు ప్రభుత్వానికి నివేదికను అందించాయి. దీంతో చుక్కల మందు పంపిణీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.
 

PREV
click me!

Recommended Stories

Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!