కృష్ణా జిల్లాలో విషాదం, నీటిలో పడిన 10 మంది పిల్లలు: ఒకరి మృతి, తొమ్మిది మంది సురక్షితం

Published : Aug 04, 2021, 03:48 PM IST
కృష్ణా జిల్లాలో విషాదం, నీటిలో పడిన 10 మంది పిల్లలు: ఒకరి మృతి, తొమ్మిది మంది సురక్షితం

సారాంశం

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్టణం మండలం దాములూరు గ్రామంలో పడవ నుండి పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. మరో 9 మంది పిల్లలను స్థానికులు కాపాడారు.


విజయవాడ: కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్టణం మండలంలోని దాములూరులో పడవ నుండి నీటిలో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో 9 మందిని గ్రామస్తులు కాపాడారు.దాములూరు గ్రామంలో పిల్లలంతా కలిసి పడవ ఎక్కి ఆడుకొంటున్నారు. పిల్లలంతా ఒకేవైపునకు నిలబడడంతో  పడవ నీటిలో ఒరిగింది.  దీంతో పడవలో ఎక్కిన 10 మంది పిల్లలు నీటిలో పడిపోయారు. 

ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పరుగున నీటిలో పడిన పిల్లలను కాపాడారు. అయితే అప్పటికే ఓ చిన్నారి నీటిలో పడి మరణించాడు. 9 మందిని గ్రామస్తులు సురక్షితంగా కాపాడారు.

PREV
click me!

Recommended Stories

Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!