రంగా హత్య సంఘటనలో టీడీపికి వంగవీటి రాధా క్లీన్ చిట్

By Nagaraju TFirst Published Jan 24, 2019, 1:27 PM IST
Highlights

 తన తండ్రి హత్యను తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం సరికాదన్నారు. తన తండ్రికి అన్ని పార్టీలలో అభిమానులు ఉన్నారని చెప్పుకొచ్చారు. తన తండ్రి విగ్రహావిష్కరణకు వెళ్తే అన్ని పార్టీల నేతలు హాజరవుతారని గుర్తు చేశారు. అయితే తన తండ్రి మరణంపై తాను చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ప్రశ్నించారని చెప్పుకొచ్చారు. 

విజయవాడ: తన తండ్రి దివంగత వంగవీటి మోహనరంగ హత్యాయత్నంపై మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని తెలుగుదేశం పార్టీ పొట్టన పెట్టుకందని వచ్చిన వ్యాఖ్యలు ఆవేశపూరితంగా వచ్చినవేనని స్పష్టం చేశారు. 

తన తండ్రి హత్యను తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం సరికాదన్నారు. తన తండ్రికి అన్ని పార్టీలలో అభిమానులు ఉన్నారని చెప్పుకొచ్చారు. తన తండ్రి విగ్రహావిష్కరణకు వెళ్తే అన్ని పార్టీల నేతలు హాజరవుతారని గుర్తు చేశారు. అయితే తన తండ్రి మరణంపై తాను చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ప్రశ్నించారని చెప్పుకొచ్చారు. 

కొందరు వ్యక్తులు చేసిన పనిని పార్టీకి అంటగట్టం కరెక్టేనా అని నిలదీసినట్లు చెప్పారు. అది నిజమేనని అనిపించిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేశానని ఆ తర్వాత బాధపడ్డానని స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు చేసిన పనిని ఒక పార్టీకి పుయ్యడం కరెక్ట్ అనిపించలేదన్నారు. 

తన తండ్రి విగ్రహావిష్కరణకు తెలుగుదేశం పార్టీ నేతలు సైతం వచ్చినప్పుడు తన వ్యాఖ్యలు వారిని కూడా కించపరిచేలా ఉన్నాయేనని గ్రహించానని తెలిపారు.రంగాను అభిమానించే వాళ్లు అన్ని పార్టీల్లో ఉన్నారన్న ఒక వాస్తవాన్ని గ్రహించలేకపోయామని పదేపదే వేరే పార్టీని విమర్శించామన్నారు. 

అది తన పొరపాటు అని ఒప్పుకుంటున్నట్లు తెలిపారు. ఆయనను అభిమానించేవాళ్లు అన్ని పార్టీల్లో ఉన్నారని ఎప్పటికీ ఉంటారని వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఇకపై రంగా అభిమానులను గౌరవించడం కాపాడుకోవడం పేదలకు సాయం చెయ్యడమే తన లక్ష్యమని రాధాకృష్ణ స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

నా క్యారెక్టర్ నే చంపారు: జగన్ మీద వంగవీటి రాధా తీవ్ర వ్యాఖ్యలు

చంద్రబాబు పిలిస్తే కూడా రాజకీయం చేస్తారా: వైసిపి నేతలపై రాధా ఫైర్

చంపేస్తామని వైఎస్ జగన్ బెదిరించారు: వంగవీటి రాధా సంచలన ఆరోపణ

జగన్ వార్నింగ్ ఇచ్చారు, అవమానించారు: వంగవీటి రాధా సంచలనం

నాకు రూ.100కోట్లు ఇచ్చాడా, ఏ పనికిమాలిన నా కొడుకు వాగాడు : వంగవీటి రాధా

 

click me!