కర్నూల్ ప్రమాదం: ప్రభుత్వాసుపత్రి వద్ద బాధిత కుటుంబాల ధర్నా

By narsimha lodeFirst Published May 12, 2019, 11:37 AM IST
Highlights

కర్నూల్ జిల్లా వెల్దూర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిని ఆదుకోవాలని కోరుతూ బాధిత కుటుంబాలు ఆదివారం నాడు కర్నూల్ ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.

కర్నూల్:కర్నూల్ జిల్లా వెల్దూర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిని ఆదుకోవాలని కోరుతూ బాధిత కుటుంబాలు ఆదివారం నాడు కర్నూల్ ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.

శనివారం సాయంత్రం వెల్దూర్తి వద్ద ప్రైవేట్ బస్సు ఢీ కొనడంతో గద్వాల జిల్లాలోని రామాపురం గ్రామానికి చెందిన 14 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కూడ  మరణించిన విషయం తెలిసిందే.

అయితే ఈ ఘటనలో మృతదేహాలకు పోస్టు మార్టం పూర్తైంది. ఇప్పటికే మూడు మృతదేహాలను రామాపురం గ్రామానికి తరలించారు. అయితే మిగిలిన మృతదేహాలను గ్రామానికి తరలించకుండా గ్రామస్తులు కర్నూల్ ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.

మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఏపీ ప్రభుత్వం నుండి స్పష్టం చేయాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం కూడ బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

జర్నీ సినిమానే: కర్నూల్‌ ప్రమాదంపై ప్రత్యక్షసాక్షులు

కర్నూలు రోడ్డు ప్రమాదం: కొద్దిసేపట్లో ఇంటికి చేరేవారే, మృతులు వీరే

కర్నూలు రోడ్డు ప్రమాదం: పెళ్లి చూపులకు వెళ్లి వస్తూ 15 మందిలో ఒక్కరే మిగిలారు

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం (ఫోటోలు)

కర్నూలులో రోడ్డు ప్రమాద బీభత్సం (వీడియో)

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం, 15 మంది మృతి

click me!