విశాఖలో విషాదం: ప్రేమికుల ఆత్మహత్యాయత్నం, ప్రియుడు మృతి

Siva Kodati |  
Published : May 12, 2019, 09:53 AM IST
విశాఖలో విషాదం: ప్రేమికుల ఆత్మహత్యాయత్నం, ప్రియుడు మృతి

సారాంశం

విశాఖలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని కైలాసగిరిపై ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది.

విశాఖలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని కైలాసగిరిపై ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం కైలాసగిరి వద్దకు చేరుకున్న సత్యనారాయణ, కమల అనే ప్రేమికులు తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును బాదంపాలులో కలుపుకుని ఆత్మహత్యకు యత్నించారు.

ఈ క్రమంలో సత్యనారాయణ అక్కడికక్కడే మరణించగా... కమల పరిస్ధితి విషమంగా ఉండటంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వీరిని శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఆడారు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలంలో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu