జర్నీ సినిమానే: కర్నూల్‌ ప్రమాదంపై ప్రత్యక్షసాక్షులు

Published : May 12, 2019, 11:10 AM ISTUpdated : May 12, 2019, 11:20 AM IST
జర్నీ సినిమానే: కర్నూల్‌  ప్రమాదంపై ప్రత్యక్షసాక్షులు

సారాంశం

 కర్నూల్ జిల్లా వెల్దుర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం.... అచ్చు జర్నీ సినిమాలో మాదిరిగానే చోటు చేసుకొందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ బస్సులో ప్రయాణం చేసిన ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.

కర్నూల్:  కర్నూల్ జిల్లా వెల్దుర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం.... అచ్చు జర్నీ సినిమాలో మాదిరిగానే చోటు చేసుకొందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ బస్సులో ప్రయాణం చేసిన ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.

హైద్రాబాద్‌ నుండి శనివారం నాడు మధ్యాహ్నం 2 గంటలకు  ప్రైవేట్ బస్సు కర్నూల్ కు ఐదున్నర గంటలకు బయలుదేరింది.బళ్లారి చౌరస్తా వద్ద మరో ముగ్గురు ప్రయాణీకులను ఎక్కించుకొని బెంగుళూరు వైపుకు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

శనివారం నాడు సాయంత్రం ఆరున్నర గంటలకు వెల్దుర్తి చెక్‌పోస్ట్‌ వద్దకు రాగా... బైక్‌ను తప్పించబోయి క్రూయిజర్‌ను ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. 

జర్నీ సినిమాలో మాదిరిగానే ఈ ప్రమాదం చోటు చేసుకొందని ఈ బస్సు ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారని ప్రయాణీకులు చెప్పారు. వెల్ధూర్తి క్రాస్ రోడ్డు వద్దకు చేరుకోగానే భారీ శబ్దం వచ్చినట్టుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

బస్సు ప్రమాదం చోటు చేసుకొన్న వెంటనే బస్సు డీజీల్ ట్యాంకు లీకవడం... ఇంజిన్‌లో పొగలు కమ్ముకోవడంతో ప్రయాణీకులు భయాందోళనలతో కేకలు వేశారు. బస్సు అద్దాలు ధ్వంసం చేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కిందకు దిగారు. బస్సు డీజీల్ ట్యాంకు నుండి లీకు కావడంతో బస్సుకు నిప్పు అంటుకొందేమో అనే భయాన్ని కొందరు ప్రయాణీకులు అనుమానం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

కర్నూలు రోడ్డు ప్రమాదం: కొద్దిసేపట్లో ఇంటికి చేరేవారే, మృతులు వీరే

కర్నూలు రోడ్డు ప్రమాదం: పెళ్లి చూపులకు వెళ్లి వస్తూ 15 మందిలో ఒక్కరే మిగిలారు

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం (ఫోటోలు)

కర్నూలులో రోడ్డు ప్రమాద బీభత్సం (వీడియో)

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం, 15 మంది మృతి

PREV
click me!

Recommended Stories

Perni Nani press meet: మోయ‌లేని గుదిబండగా అమ‌రావ‌తి చంద్రబాబుపై పేర్నినాని సెటైర్లు | Asianet Telugu
Raghurama KrishnamRaju: మావాళ్లని మోసం చేయొద్దు | Update on Akividu Ramalayam | Asianet News Telugu