అనంతపురం జిల్లా నుండే పోటీ చేస్తా...సీటు మాత్రం సస్పెన్స్....

Published : Sep 16, 2017, 11:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
అనంతపురం జిల్లా నుండే పోటీ చేస్తా...సీటు మాత్రం సస్పెన్స్....

సారాంశం

‘‘అధిష్టానం ఆదేశిస్తే అనంతపురం జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేస్తా’’. పురంధేశ్వరి తాజా ప్రకటన ఇది. హటాత్తుగా శనివారం భాజపా నేతమ పురంధేశ్వరి చేసిన ప్రకటన మిత్రపక్ష నేతల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అనంత జిల్లాలో రెండు ఎంపీ సీట్లున్నాయి. ఒకటి అనంతపురం, రెండోది హిందూపురం. మరి ఏ సీటుకు పురంధేశ్వరి టెండర్ వేసారో అర్ధం కావటం లేదు.

‘‘అధిష్టానం ఆదేశిస్తే అనంతపురం జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేస్తా’’. పురంధేశ్వరి తాజా ప్రకటన ఇది. హటాత్తుగా శనివారం భాజపా నేతమ పురంధేశ్వరి చేసిన ప్రకటన మిత్రపక్ష నేతల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జిల్లా పర్యటన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పోయిన ఎన్నికల్లో కడప జిల్లాలోని రాజంపేట నుండి పోటీ చేసి ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే కదా? అయితే అక్కడ నుంచి వైకాపా అభ్యర్థి మిథున్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు.

 ఆ సంగతలా ఉంటే వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుండి పురందేశ్వరి అంటున్నారు. అధిష్టానం ఆదేశిస్తే ఈ  జిల్లా నుంచే పోటీ చేస్తా అంటున్నారు. అనంత జిల్లాలో రెండు ఎంపీ సీట్లున్నాయి. ఒకటి అనంతపురం, రెండోది హిందూపురం. మరి ఏ సీటుకు పురంధేశ్వరి టెండర్ వేసారో అర్ధం కావటం లేదు.

అనంతపురం నుంచి జేసీ దివాకర్ రెడ్డి, హిందూపురం నుంచి నిమ్మల కిష్టప్ప ఎంపీలుగా ఉన్నారు. మరి పురందేశ్వరి బీజేపీ నేత. తెలుగుదేశం సిట్టింగ్ స్ధానాల్లో భాజపా నేత ఎలా పోటీచేస్తారన్నదే పెద్ద చర్చ మొదలైంది. మరి టీడీపీ తన మిత్రపక్షానికి ఈ సీట్లను త్యాగం చేస్తుందా? ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. చంద్రబాబునాయుడు అంటే పురందేశ్వరికి అస్సలు పడదు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్న నియోజకవర్గాల్లో ఒక్కదాన్ని బీజేపీకి ఇచ్చి, అక్కడ పురందేశ్వరి గెలుపుకు చంద్రబాబు ఒప్పుకుంటారా?

ఒకవేళ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రమే పురందేశ్వరి కోరుకున్న చోట పోటీ చేసే అవకాశం ఉంటుంది. పొత్తుంటే మాత్రం రాజకీయ సమీకరణాల ప్రకారం  అనంతపురం ఎంపీ సీటు కన్నా, హిందూపురం సీటునే పురంధేశ్వరి కోరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హిందూపురం అసెంబ్లీ నియోజవకవర్గం టిడిపి కంచుకోటల్లో ఒకటి. గతంలో ఎన్టీఆర్ కూడా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.

కాకపోతే టిడిపి తరపున బిసిలు పోటీ చేసే కొద్ది సీట్లలో హిందుపురం కూడా ఒకటి. అటువంటిది అప్పనంగా వొదిన దగ్గుబాటి పురంధేశ్వరికి సీటును అప్పగిస్తారా చంద్రబాబు?  ఇవన్నీ ఆలోచించకుండానే పురంధేశ్వరి ప్రకటన చేసేంత అమాయకురాలు కూడా కాదు కదా? ఎవరి వ్యూహాలేంటో తొందరలో బయటపడకుండా ఉంటాయా, చూద్దాం.

PREV
click me!

Recommended Stories

YS Jagan Comments: అలా చేయడం బాబుకే సాధ్యం జగన్ కీలక కామెన్స్ కామెంట్స్| Asianet News Telugu
YS Jagan Comments on Chandrababu: ఇది ప్రభుత్వమా జంగిల్ రాజ్యమా:జగన్ | Asianet News Telugu