AP CM YS Jagan Birthday: సీఎం జగన్ కు భర్త్ డే విషెస్ తెెలిపిన ప్రధాని మోదీ

Arun Kumar P   | Asianet News
Published : Dec 21, 2021, 12:44 PM ISTUpdated : Dec 21, 2021, 12:53 PM IST
AP CM YS Jagan Birthday: సీఎం జగన్ కు భర్త్ డే విషెస్ తెెలిపిన ప్రధాని మోదీ

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికన విషెస్ తెెలియజేసారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. 

అమరావతి: ఇవాళ (మంగళవారం) ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు (ys jaganmohan reddy birth day).  ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని, కేంద్ర మంత్రులతో పాటు ఏపీ గవర్నర్, మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు సీఎం జగన్ కు పుట్టినరోజు విషెస్ తెలిపారు. 

ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) ట్విట్టర్ వేదికన జగన్ కు భర్త్ డే విషెస్ తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో చిరకాలం ఆనందంగా వుండాలని కోరుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు. ఇక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (nitin gadkari) కూడా సీఎం జగన్ కు భర్త్ డే విషెస్ తెలిపారు. 

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (biswabhushan harichandan) కూడా సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా జగన్ కు ఫోన్ చేసిన గవర్నర్ భర్త్ డే విషెస్ తెలిపారు. మంచి ఆరోగ్యంతో ఆనందకరమైన జీవితం గడపాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి, పూరి జగన్నాథస్వామి ఆశిస్సులతో జగన్ నిండు నూరేళ్లు ప్రజాసేవలో తరించాలని కోరుకుంటున్నట్లు గవర్నర్ తెలిపారు. 

Video  YS Jaganmohan Reddy Birthday:దేశంలోనే మొదటిసారి... అరుదైన బహుమతి సిద్దంచేస్తున్న వైసిపి ఎమ్మెల్యే 

ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ది పథంలో నడిపిస్తూ మరింత పురోగతి సాధించేలా చూడాలని... రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా పరిపాలన అందించాలని పుట్టినరోజు సందర్భంగా జగన్ ను సూచిస్తున్నట్లు గవర్నర్ హరిచందన్ పేర్కొన్నారు.   

ఇక తమ ప్రియతమ నాయకుడి పుట్టినరోజు సందర్భంగా వైసిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే జగన్ పేరిట దేవాలయాల్లో పూజలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. 

ఇప్పటికే వైసిపి అదిష్టానం పార్టీ అధ్యక్షుడు జగన్ పుట్టినరోజున సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైసిపి శ్రేణులకు పిలుపునిచ్చింది. దీంతో అన్నదానం, రక్తదానం, మొక్కలు నాటడం, నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను వైసిపి నాయకులు, కార్యకర్తలు నిర్వహిస్తున్నారు.  

read more  YS Jagan Birthday: సీఎం వైఎస్ జగన్‌కు రోజా సర్‌ప్రైజ్ బర్త్‌ డే గిఫ్ట్.. మరోసారి తన మార్క్ చూపించిన రోజా..

ఇక సీఎం క్యాంప్‌ కార్యాలయం ఆవరణలోని గోశాల ముందు భాగంలో ఆర్గానిక్‌ ఆర్ట్‌ ఫార్మింగ్‌ (organic art farming) విధానంలో గ్రాస్‌పై సీఎం వైఎస్‌ జగన్‌ ముఖచిత్రం ఏర్పాటు చేయించారు. వంద అడుగుల పొడవు, వంద అడుగుల వెడల్పుతో 2డీ ఆర్కిటెక్చర్‌ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. సీఎం వైఎస్ జగన్‌పై ‘అధిపతి’ టైటిల్‌తో  వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి (chevireddy bhaskar reddy) రూపొందింపజేసిన ‘వర్థిల్లు.. వెయ్యేళ్లు’ పాటల సీడీని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) సోమవారం ఆవిష్కరించారు. 

జగన్ బర్త్ డే సందర్భంగా తన నియోజకవర్గంలోని మీరాసాబ్ పాలెంను దత్తత తీసుకుంటున్నట్టుగా ఎమ్మెల్యే రోజా (roja) ప్రకటించారు. మీరాసాబ్ పాలెం గ్రామంలో ఎవరూ పెద్దగా చదువుకోలేదని.. అందుకే ఈ ఊరిని దత్తత తీసుకుని జగన్ వచ్చే బర్త్ డే లోపు మోడల్ విలేజ్‌గా మార్చి బహుమతిగా ఇవ్వాలని రోజా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతేడాది వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా రోజా.. ఓ అమ్మాయిని దత్తత తీసుకుని చదివిస్తున్న సంగతి తెలిసిందే.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్