YS Jagan Birthday: సీఎం వైఎస్ జగన్‌కు రోజా సర్‌ప్రైజ్ బర్త్‌ డే గిఫ్ట్.. మరోసారి తన మార్క్ చూపించిన రోజా..

Published : Dec 21, 2021, 11:02 AM IST
YS Jagan Birthday: సీఎం వైఎస్ జగన్‌కు రోజా సర్‌ప్రైజ్ బర్త్‌ డే గిఫ్ట్.. మరోసారి తన మార్క్ చూపించిన రోజా..

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై రోజ (MLA Roja) పలు సందర్భాల్లో తన అభిమానాన్ని చాటుకున్నారు. అసెంబ్లీలో సైతం పలుమార్లు వైఎస్ జగన్‌పై (YS Jagan)  పొగడ్తల వర్షం కురిపించారు. బహిరంగ సభలలో, పార్టీ సమావేశాల్లో కూడా ఆమె జగన్‌పై తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా వైఎస్ జగన్ బర్త్‌డే (ys jagan birthday) సందర్భంగా ఆయనకు రోజా సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిర్భావం నుంచి రోజా.. వైఎస్ జగన్ (YS Jagan) వెంట నడుస్తున్నారు. నగరి నియోజకవర్గం (nagari constituency) నుంచి రెండు సార్లు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోజా.. ప్రతిపక్షాలు జగన్‌పై చేసే విమర్శలను తిప్పికొట్టడంలో ముందువరుసలో నిలుస్తారు. అంతేకాకుండా తనదైన దూకుడుతో విపక్షాలపై విమర్శలు చేస్తారు. అయితే ఈ పొలిటికల్ జర్నీలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై రోజా (MLA Roja) పలు సందర్భాల్లో తన అభిమానాన్ని చాటుకున్నారు. అసెంబ్లీలో సైతం పలుమార్లు వైఎస్ జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. బహిరంగ సభలలో, పార్టీ సమావేశాల్లో కూడా ఆమె జగన్‌పై తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. 

అయితే ఈ ఏడాది వైఎస్ జగన్ జన్మదినం (డిసెంబర్ 21) సందర్భంగా తన నియోజవర్గంలోని సంబరాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వైఎస్ జగన్ బర్త్‌డే (ys jagan birthday) సందర్భంగా వినూత్నంగా ఆలోచించిన రోజా.. చిరకాలం గుర్తుపెట్టుకనేలా ఓ మంచి పని చేయాలని ఫిక్స్ అయ్యారు. గతేడాది వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా రోజా.. ఓ అమ్మాయిని దత్తత తీసుకుని చదివిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జగన్ బర్త్ డే సందర్భంగా తన నియోజకవర్గంలోని మీరాసాబ్ పాలెంను దత్తత తీసుకుంటున్నట్టుగా తెలిపారు. మీరాసాబ్ పాలెం గ్రామంలో ఎవరూ పెద్దగా చదువుకోలేదని.. అందుకే ఈ ఊరిని దత్తత తీసుకుని జగన్ వచ్చే బర్త్ డే లోపు మోడల్ విలేజ్‌గా మార్చి బహుమతిగా ఇవ్వాలని రోజా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 

రోజాకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన దత్త కూతురు..
గత ఏడాది డిసెంబర్ 21న పుష్పకుమారి అనే చిన్నారి చదువు బాధ్యతలను రోజా తీసుకున్న సంగతి తెలిసిందే. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ అమ్మాయిని దత్తత తీసుకుని చదవిస్తున్నారు. డాక్టర్ కావాలనే పుష్ప కుమారి కోరికను గమనించిన రోజా.. ఆమెను కూడా తన సొంత కూతురిలా చదివిస్తానని ఆ సందర్భంగా చెప్పారు. తిరుపతి గర్ల్స్ హోం ఉండి చదువుకుంటున్న ఆ అమ్మాయి.. నీట్‌ పరీక్షల్లో సత్తా చాటింది. నీట్‌లో 89 శాతం మార్కులను సాధించింది. 

రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను (ys jagan birthday celebrations) వైసీపీ నాయకులు, అభిమానులు.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. పలుచోట్ల అర్ధరాత్రి కేక్‌ కట్ చేసి వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ఏడాది పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చేలా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు జరపాలని వైసీపీ శ్రేణులునిర్ణయించాయి. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా నేడు పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నారు. సోషల్ మీడియాలో కూడా వైఎస్ జగన్ బర్త్‌డే సందర్భంగా పెద్ద ఎత్తున విషెస్ వెల్లువెత్తుతున్నాయి. నేడు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద మొక్కలు నాటడం, రక్తదానం, పేదలకు దుస్తులు, దుప్పట్లు, నిత్యావసరాల పంపిణీ, అన్నదానం తదితర కార్యక్రమాలను చేపడుతున్నారు. 

ఇక,  సీఎం క్యాంప్‌ కార్యాలయం ఆవరణలోని గోశాల ముందు భాగంలో ఆర్గానిక్‌ ఆర్ట్‌ ఫార్మింగ్‌ విధానంలో గ్రాస్‌పై సీఎం వైఎస్‌ జగన్‌ ముఖచిత్రం ఏర్పాటు చేయించారు. వంద అడుగుల పొడవు, వంద అడుగుల వెడల్పుతో 2డీ ఆర్కిటెక్చర్‌ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. సీఎం వైఎస్ జగన్‌పై ‘అధిపతి’ టైటిల్‌తో  వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి రూపొందింపజేసిన ‘వర్థిల్లు.. వెయ్యేళ్లు’ పాటల సీడీని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం ఆవిష్కరించారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్