
అమరావతి: అనంతపురం జిల్లాలో వివాదాస్పదంగా మారిన ప్రబోధానంద స్వామి, జేసీ సోదరులకు మధ్య గొడవ చివరకు సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. ప్రబోధానంద మద్దతుదారులు జేసీ సోదరుల అకృత్యాలపై చంద్రబాబు నాయుడకు ఫిర్యాదు చేశారు.
జేసీ సోదరుల చర్యల వల్ల తామంతా భయాందోళనకు గురి అవుతున్నామని చంద్రబాబు దగ్గర వాపోయారు. ఆశ్రమంలోని భక్తులను బలవంతంగా ఖాళీ చేయిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతిఘటిస్తే తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. తమకు జేసీ సోదరుల నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని సీఎంను కోరారు.
మరోవైపు ప్రబోధానందపై గతంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ప్రబోధానంద అసలు స్వామే కాదని ఆరోపించారు. ప్రబోధానంద ఆకృత్యాలపై సీఎం చంద్రబాబుకు వీడియోలతో సహా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రబోధానందస్వామి ఆశ్రమం చుట్టూ కంచె....టెన్షన్ టెన్షన్
సిఐ వార్నింగ్: జేసి ఏమన్నాడో చూడండి (వీడియో)
ప్రబోధానందస్వామి వీడియోలను బాబుకు ఇచ్చిన జేసీ
చల్లబడిన జేసీ దివాకర్ రెడ్డి: అధికారులు ఏం చేశారంటే?
జేసీ దివాకర్ రెడ్డికి బాబు ఫోన్: న్యాయ విచారణ చేయిస్తామని హామీ
ఆశ్రమంపై చర్యలు తీసుకోండి.. రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందే కూర్చొన్న జేసీ
చిన్నపొడమలలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ ముందు జేసీ ధర్నా
గణేష్ నిమజ్జనంతో చిన్నపొడమలలో ఉద్రిక్తత: జేసీ దివాకర్ రెడ్డి నిరసన