బెజవాడలో బలవంతపు సరోగసి.. ఆ కేసు మా పరిధిలోకి రాదు: పోలీసులు

By sivanagaprasad kodatiFirst Published Oct 8, 2018, 1:11 PM IST
Highlights

బెజవాడలో యువతికి వైద్యులు బలవంతంగా సరోగసికి యత్నించిన వివాదంపై పోలీసులు స్పందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కార్తీక దత్త ఆస్పత్రిపై కేసు నమోదు చేశామని.. ఆమెకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదిక ఇంకా అందాల్సి ఉందన్నారు.

బెజవాడలో యువతికి వైద్యులు బలవంతంగా సరోగసికి యత్నించిన వివాదంపై పోలీసులు స్పందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కార్తీక దత్త ఆస్పత్రిపై కేసు నమోదు చేశామని.. ఆమెకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదిక ఇంకా అందాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసిన తర్వాత వైద్యులు ఎవరూ పరారీలో లేరన్నారు. బాధితురాలు శ్రీదేవిని బెదిరించిన కేసు తమ పరిధిలోకి రాదన్నారు. 

గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన శ్రీదేవి అనే యువతికి రెండు నెలల కిందట విజయవాడలోని కార్తీక దత్త ఆస్పత్రి వైద్యులు బలవంతంగా సరోగసి చేసేందుకు ప్రయత్నించారు. దీనిని అడ్డుకున్న యువతి ఆస్పత్రి యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఆస్పత్రిపై కేసు నమోదు చేశారు. అయితే కేసు వెనక్కితీసుకోవాలని గత కొద్దిరోజులుగా ఆస్పత్రి యాజమాన్యం నుంచి బెదిరింపు కాల్స్ వస్తుండటంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

బెజవాడలో యువతికి బలవంతంగా సరోగసి.. యువతి ఆత్మహత్యాయత్నం

click me!