విశాఖలో పరిపాలనా రాజధాని కోసం మన లక్ష్యం,గమ్యం ఉండాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. ఆముదాలవలసలో విశాఖ రాజధాని జేఏసీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
శ్రీకాకుళం: మన లక్ష్యం, గమ్యం, ఆలోచన విశాఖ రాజధాని కావాల్సిన అవసరం ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో బుధవారంనాడు విశాఖ రాజధాని జేఏసీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వకపోతే నష్టపోతామన్నారు. ఉత్తరాంధ్రలో అన్ని రాజకీయ పార్టీలు విశాఖ రాజధాని కోసం కలిసి రావాలని ఆయన కోరారు..
రాజధాని ఒకటైతే వద్దు, మూడైతే ముద్దు అని ఆయనచెప్పారు.విశాఖ రాజధాని లక్ష్యసాధన వైపు దూసుకు పోవాల్సిన అవసరం ఉందని తమ్మినేని సీతారాం చెప్పారు.అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులను ప్రభుత్వం తెచ్చిందన్నారు.భవిష్యత్తు తరాల కోసమే వికేంద్రీకరణను సీఎం జగన్ తీసుకువచ్చారన్నారు.విశాఖ రాజధాని కావడం ఉత్తరాంధ్ర వాసుల కల అని ఆయన చెప్పారు.అమరావతి కోసం 30 వేల ఎకరాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.రియల్ ఏస్టేట్ వ్యాపారం కోసమే 30 వేల ఎకరాలను సేకరించారని ఆయన ఆరోపించారు