తాడేపల్లిలో సీఎం జగన్ క్యాంప్‌ ఆఫీసు సమీపంలో మహిళా ఆత్మహత్య యత్నం.. ఏం జరిగిందంటే..?

Published : Nov 02, 2022, 01:41 PM ISTUpdated : Nov 02, 2022, 01:47 PM IST
తాడేపల్లిలో సీఎం జగన్ క్యాంప్‌ ఆఫీసు సమీపంలో మహిళా ఆత్మహత్య యత్నం.. ఏం జరిగిందంటే..?

సారాంశం

తాడేపల్లిలో సీఎం జగన్ క్యాంప్‌ ఆఫీసు సమీపంలో  ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. అనారోగ్యంతో బాధపడుతున్న కూతురుతో కలిసి సీఎంవో ఆఫీసు వద్దకు వచ్చిన మహిళా చేయి కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది.

తాడేపల్లిలో సీఎం జగన్ క్యాంప్‌ ఆఫీసు సమీపంలో  ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. అనారోగ్యంతో బాధపడుతున్న కూతురుతో కలిసి సీఎంవో ఆఫీసు వద్దకు వచ్చిన మహిళా చేయి కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. కుమార్తె చికిత్స కోసం ఇల్లు  అమ్ముకోకుండా ఇద్దరు కానిస్టేబుల్స్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని మహిళ ఆరోపించారు. వివరాలు.. కాకినాడ సమీపంలోని  రాయుడుపాలెంకు చెందిన అరుద్ర మహిళ తన కూతురు అనారోగ్యంతో బాధపడుతుందని తెలిపారు. ఇల్లు అమ్మి చికిత్స చేయిద్దామంటే ఇద్దరు కానిస్టేబుల్స్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. 

కానిస్టేబుల్స్ దౌర్యన్యంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరినీ ఇల్లు  కొననీయకుండా వారు అడ్డుపడుతున్నారని  చెప్పారు. ఈ క్రమంలోనే తన బాధ చెప్పుకునేందుకు సీఎం కార్యాయానికి వచ్చానని  చెప్పారు. తన కుమార్తె చికిత్స ఖర్చుపై అంచనాలు ఇవ్వమని  సీఎంవో అధికారులు అడిగారని తెలిపారు. సీఎంను కలవాలంటే ఎమ్మెల్యేతో రావాలని అధికారులు చెప్పినట్టుగా తెలిపారు. 

ఈ  క్రమంలోనే సీఎం జగన్‌ను అధికారులు కలవనీయకపోవడంతో తనకు న్యాయం జరగదనే ఆందోళనతో అరుద్ర ఆత్మహత్యకు యత్నించినట్టుగా తెలుస్తోంది. సీఎం క్యాంప్‌ ఆఫీసుకు కొద్ది దూరంలో కత్తితో చేయి కోసుకున్నారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక, అనారోగ్యంతో బాధపడుతూ వీల్‌ ఛైర్‌లో ఉన్న అరుద్ర కుమార్తె పరిస్థితి చూసి స్థానికులు చలించిపోయారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?