అనంతపురంలో విషాదం:విద్యుత్ షాక్ తో నలుగురు కూలీలు మృతి

By narsimha lodeFirst Published Nov 2, 2022, 2:51 PM IST
Highlights

అనంతపురం జిల్లాలోని బొమ్మనహల్  మండలం దర్గాహొన్నూరులో  విద్యుత్ షాక్ తో నలుగురు  కూలీలు మరణించారు.

అనంతపురం:జిల్లాలో బుధవారంనాడు విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడి నలుగురు కూలీలు మృతి చెందారు. జిల్లాలోని బొమ్మనహల్  మండలం దర్గాహొన్నూరులో  ఈ ఘటన  చోటుచేసుకుంది.  వ్యవసాయ పనులకు  ట్రాక్టర్ లో వెళ్తున్న సమయంలో విద్యుత్ మెయిన్  లైన్ తెగి పడి  నలుగురు కూలీలు మృతి  చెందారు..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిని చికిత్స కోసం  బళ్లారి ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదానికి గురైనవారంతా దర్గాహోన్నూరుకు  చెందిన వారేనని సమాచారం.మృతులను పార్వతి, సక్రమ్మ, రత్నమ్మ, వడ్రక్క గా గుర్తించారు.ఈ ఏడాది జూన్ 30న ఉమ్మడి అనంతపురం  జిల్లాలోని తాడిమర్రి మండలంలో వ్యవసాయ పనులకు వెళ్తున్న కూలీల ఆటోపై విద్యుత్  వైర్లు తెగిపడి ఐదుగురు కూలీలు మరణించారు. నాలుగు నెలల్లోఅనంతపురం జిల్లాలో విద్యుత్ షాక్ తో మొత్తం 11 మంది మృతి చెందారు.

తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద ఆటోపై విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో  ఆటోలో  ఉన్న ఐదుగురు కూలీలు మృతి చెందారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఉన్న విద్యుత్ వైర్లను ఉడుత కొరకడంతో విద్యుత్ వైర్లు తెగి ఆటోపై పడ్డాయి. ఆటోపై ఉన్న ఇనుప స్టాండ్ కారణంగా షాక్ కు గురై ఆటోకు మంటలు అంటుకున్నాయి.ఈ ఘటనలో ఐదుగురు మహిళలు మరణించారు. మరో నలుగురు ప్రమాదం నుండి తృటిలో బయపడ్డారు.

ఈ ఏడాది జూన్ లో ప్రమాదానికి  కూడ విద్యుత్ వైర్లు  తెగడమే కారణం. ఇవాళ జరిగిన ప్రమాదానికి కూడా విద్యుత్ వైర్లే కారణం. అయితే నాసిరకం విద్యుత్  వైర్లను ఉపయోగించడం  వల్లే విద్యుత్ వైర్లు తెగిపోతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లె ప్రమాదం  జరిగిన సమయంలోనే  నాసిరకం విద్యుత్ వైర్ల అంశంపై విపక్షాలు తీవ్రమైన  ఆరోపణలు చేశాయి.

click me!