వైసిపి వినాయకుడికి అన్ని అనుమతులు... టిడిపి గణపయ్యకేనా ఆంక్షలన్నీ?: పోలీసులపై సీరియస్ (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 13, 2021, 1:24 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో శనివారం వినాయక నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. పోలీసులు నిమజ్జన ఊరేగింపును నిబంధనల పేరిట అడ్డుకోవడమే ఈ ఉద్రిక్తతలకు కారణమయ్యింది. 

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో వినాయకచవితి వివాదం కొనసాగుతోంది. కేవలం ఇళ్లలోనే పండగ చేసుకోవాలని... బహిరంగ ప్రదేశాల్లో భారీ విగ్రహాలు ఏర్పాటుచేయరాదని వైసిపి సర్కార్ ఆదేశాలతో మొదలైన వివాదం నిమజ్జనం సమయంలోనూ సాగుతోంది. వినాయక నిమజ్జనం సమయంలో కోవిడ్ నిబంధనలు, ఇతర కారణాల పేరిట పోలీసు అతిగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను నిమజ్జన వేడుకలను అడ్డుకుంటున్న పోలీసులు అధికార పార్టీ నాయకులు వినాయక నిమజ్జనానికి మాత్రం అన్ని అనుమతులిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

గుంటూరు జిల్లాలో రెండు చోట్ల వినాయక నిమజ్జనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. శనివారం రాత్రి కాకుమాను మండలం గరికపాడు గ్రామంలో చేపట్టిన వినాయక నిమజ్జనం పోలీసులు ఎంట్రీతో ఉద్రిక్తంగా మారింది. డప్పులతో ఊరేగింపుగా వెళ్తున్న వినాయక విగ్రహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. డప్పులు వాయిస్తూ ఇలా ఊరేగింపుగా వెళ్లడానికి అనుమతి లేదంటూ అడ్డుకోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. 

వీడియో

పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని... ఇదే గ్రామంలో వైసిపి నాయకులు డప్పులతో ఊరేగింపుగా వెళ్లి వినాయక నిమజ్జనం చేశారని... వారినే ఎందుకు అడ్డుకోలేదని పోలీసులను నిలదీశారు. తాము చేసింది తప్పయితే వారు చేసింది కూడా తప్పేకదా... వారినెందుకు అడ్డుకోలేదు? అంటూ  గరికపాడు మహిళలు, గ్రామస్తులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

read more  వినాయక నిమజ్జనం : మినహాయింపులు ఇవ్వకపోతే గందరగోళమే... హైదరాబాద్ స్తంభిస్తుంది..

ఇక ఇదే గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెద్ద వడ్లపూడి గ్రామంలో  వినాయక ఊరేగింపుని రూరల్ ఎస్సై సుంకర లోకేష్ అడ్డుకున్నారు. కోవిడ్ నిబంధనలను పాటించడం లేదని... ఊరేగింపుకు డప్పులు, మైకులు కి పర్మిషన్ లేదంటూ తన సిబ్బందితో కలిసి ఎస్సై అడ్డుకున్నాడు. ఆనందోత్సాహాలతో వినాయక నిమజ్జనాన్ని చేస్తుంటే ఇలా పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీస్ వాహనాన్నిఅడ్డుకొని ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

ఇక కర్నూలు జిల్లా కోడుమూరు చిన్నబోయవీధి గణేష్ నిమజ్జనం ఊరేగింపులో కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీజెకు అనుమతి లేదంటూ పోలీసులు గణేష్ విగ్రహ ఊరేగింపును అడ్డుకున్నారు. అయితే కొందరు భక్తులు వాగ్వాదం కు దిగటంతో పోలీసులు వారికి నచ్చచెప్పారు. దీంతో ఊరెగింపు సాఫిగా సాగింది.

click me!