జగన్ రెడ్డి నాడు-నేడులో భారీ అక్రమాలు... గుట్టు రట్టు చేసింది సుబ్బారెడ్డే: లోకేష్ సంచలనం

By Arun Kumar PFirst Published Sep 13, 2021, 12:14 PM IST
Highlights

నాడు నేడు అక్రమాల పుట్టఅని చెబితే సీఎం జగన్ కు సంబంధించిన మీడియా నాపై చెత్తరాతలు రాసిందని... ఇప్పుడు స్వయంగా వైసిపి నాయకుడు సుబ్బారెడ్డే మీ అక్రమాల గుట్టును బయటపెట్టాడని నారా లోకేష్ అన్నారు. 

మంగళగిరి: వైసిపి ప్రభుత్వం ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలు మారుస్తామని చేపట్టిన నాడు-నేడులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఈ విషయాన్నే తాను గతంలో చెబితే వైసిపి అనుకూల మీడియా నాపై చెత్తరాతలు రాసిందన్నారు. కానీ ఇప్పుడు స్వయంగా విద్యాశాఖ మంత్రి సురేష్ సొంత నియోజకవర్గంలోనే వైసిపి నాయకుడే నాడు-నేడులో జరిగిన అవినీతి, అక్రమాల గుట్టు రట్టు చేశాడని లోకేష్ తెలిపారు.

''జగన్ రెడ్డి నాడు-నేడు గుట్టుని సుబ్బారెడ్డి రట్టు చేసారు. నాడు- నేడు అక్రమాల పుట్టని, విద్యార్థుల పాలిట శాపంగా మారిందని నేను అనగానే తొందరపడి కొంతమంది అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మరీ రాజకీయాలు చెయ్యొద్దని లెక్చర్లు ఇచ్చారు. ఇక జగన్ రెడ్డి దొంగ మీడియా చనిపోయింది ప్రైవేట్ విద్యార్థి అయితే లోకేష్ కి నష్టం ఏంటి అంటూ చెత్త రాతలు రాసారు'' అని మండిపడ్డారు.  

''ఇప్పుడు ప్రకాశం జిల్లా విద్యాశాఖ మంత్రి సురేష్ గారి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గుర్రపుశాల ఎంపీపీ విద్యాకమిటీ చైర్మన్ బద్దెగం సుబ్బారెడ్డి నాడు-నేడు పేరుతో జరుగుతున్న అక్రమాలు మొత్తం బయటపెట్టారు. ఇదో దోపిడీ కార్యక్రమమని సొంత పార్టీ వాళ్లే కుండబద్దలు కొడుతున్నారు. దీనిపై విచారణ జరిగితే పిల్లల పేరుతో వైకాపా పందికొక్కులు తిన్న కోట్ల లెక్కలు బయటపడతాయి'' అని లోకేష్ పేర్కొన్నారు.  

READ MORE  ఆ పోలీసుల పేర్లు రాసుకుంటున్నాం... భవిష్యత్ లో వారి తాటతీస్తాం: అచ్చెన్న స్ట్రాంగ్ వార్నింగ్

ఇక ఇదివరకే నాడు‌-నేడుపై టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. ''గురుదేవో భవః అని భావించే సమాజం మనది. అలాంటిది నెల్లూరులోని మనుబోలు జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ రమేష్‍కుమార్ గారు తనకు కరోనా పాజిటివ్ అని, ఆసుపత్రిలో చేర్చుకుని తన ప్రాణాలను కాపాడమని..  ఆసుపత్రి సిబ్బందిని, అధికారులను, వైసీపీ నేతలను వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి రమేష్ గారు కన్నుమూశారు. నాడు ఒక హెడ్మాస్టర్ ఉండేవారు. నేడు లేరు. ఇదేనా మీ నాడు-నేడు?ఈ రాష్ట్రంలో అసలు పాలనాయంత్రాంగం ఉందా? తమ ప్రాణాలను కాపాడమని వేడుకుంటూ చనిపోడానికా ప్రజలు ఓట్లేసి అధికారమిచ్చింది. ఇలాంటి వీడియోలు చూస్తుంటే బాధేస్తోంది. ప్రభుత్వంలో మాత్రం స్పందన లేదు'' అంటూ మండిపడ్డారు.  
 

click me!