ఏపీ హైకోర్టు తీర్పుపై స్టేను నిరాకరించిన సుప్రీంకోర్టు...

By AN TeluguFirst Published Sep 13, 2021, 12:21 PM IST
Highlights

ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని హిందూ ధార్మిక పరిరక్షణ ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్ ను అనుమతించిన ఇందూ బెనర్జీ,  జస్టిస్  జెకె మహేశ్వరిల ధర్మాసనం స్టే ఇవ్వడానికి ఇటీవల నిరాకరించింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

న్యూఢిల్లీ : తెలుగుదేశం ప్రభుత్వం 2015లో జారీ చేసిన జీవో లోని క్లాజును కొట్టేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ విజయవాడలో గల హిందూ ధార్మిక పరిరక్షణ ట్రస్ట్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం  కామన్ గుడ్ ఫండ్ కు ఇచ్చే 9 శాతం నిధుల్లో రెండు శాతాన్ని ధార్మిక పరిరక్షణ ట్రస్ట్ కు తప్పనిసరిగా కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ధార్మిక, హిందూ మత సంస్థలు, దేవాదాయ చట్టం-1987 లోని  సెక్షన్ 70 కి వ్యతిరేకమని సుప్రీంకోర్టు తెలిపింది.

 ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని హిందూ ధార్మిక పరిరక్షణ ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్ ను అనుమతించిన ఇందూ బెనర్జీ,  జస్టిస్  జెకె మహేశ్వరిల ధర్మాసనం స్టే ఇవ్వడానికి ఇటీవల నిరాకరించింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.  కామన్ గుడ్ ఫండ్ కు నిధులు కేటాయింపు 5 నుంచి 9 శాతానికి పెంచుతూ 2015 అక్టోబర్ 1న అప్పటి టిడిపి ప్రభుత్వం జీవో జారీ చేసింది.

జీవో లోని క్లాజ్‌ 7(2)(బీ) ప్రకారం హిందూ ధార్మిక కార్యక్రమాలను నిమిత్తం 9 శాతం నిధుల నుంచి రెండు శాతాన్ని తప్పనిసరిగా కేటాయించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని మూడు నెలలకోసారి ప్రత్యేక ఖాతాలో సదరు ట్రస్ట్ వద్ద ఉంచాలని పేర్కొంది.  1987 చట్టం సెక్షన్ 70 ప్రకారం  విశాఖపట్నానికి చెందిన ఓ.నరేష్ కుమార్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

ఆ పోలీసుల పేర్లు రాసుకుంటున్నాం... భవిష్యత్ లో వారి తాటతీస్తాం: అచ్చెన్న స్ట్రాంగ్ వార్నింగ్ 

హిందూ ధార్మిక పరిరక్షణ ట్రస్ట్ ఏ చట్టబద్ధమైన నిబంధనలకు  లోబడి ఏర్పాటు కాలేదని, సెక్షన్ 70లో  పేర్కొన్న  ప్రయోజనాల కోసం మాత్రమే ఆ మొత్తాన్ని మళ్లిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని,  హిందువుల ప్రయోజనాల కోసం ఆ విధంగా మళ్ళించడం చట్టవిరుద్ధం కాదని,  ఆలయాల తక్షణ మరమ్మతులు,  పునర్నిర్మాణ ఆ మొత్తాన్ని వినియోగిస్తారని  ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టులో వివరించారు.

వాదనల అనంతరం నాటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్,  జస్టిస్ సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సదరు ట్రస్టు చట్టబద్ధమైన సంస్థ కాదని గుర్తించింది.  హిందూ ధార్మిక కార్యకలాపాలకు ఇచ్చే కామన్ గుడ్ ఫండ్  తొమ్మిది శాతం నిధుల్లో  రెండు శాతాన్ని తప్పనిసరిగా ఆ ట్రస్టుకు కేటాయించాలనడం చట్ట విరుద్ధమని పేర్కొంది.  జీవో లోని క్లాజ్‌ 7(2)(బీ)ని కొట్టేసింది.  ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ధార్మిక పరిరక్షణ ట్రస్ట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

click me!