కరణం రాహుల్ ను హత్య చేయించింది కొరాడ విజయ్ కుమార్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసు విషయమై శాస్త్రీయమైన ఆధారాలను పోలీసులు సేకరించారు. పార్కింగ్ చేసిన కారులోనే కరణం రాహుల్ శవంగా తేలిన విషయం తెలిసిందే.
విజయవాడ: పార్కింగ్ చేసిన కారులోనే శవంగా తేలిన వ్యాపారవేత్త కరణం రాహుల్‌ను హత్య చేయించింది ఆయన వ్యాపార భాగస్వామి కొరాడ విజయ్ కుమార్‌గా పోలీసులు నిర్ధారించారు. శాస్త్రీయ ఆధారాలతో పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చారు.
also read:విజయవాడ కారులో డెడ్‌బాడీ: రాహుల్ హత్యతో సంబంధం లేదన్న కోగంటి సత్యం
undefined
రాహుల్ తండ్రి ఫిర్యాదుతో పద్మశ్రీ, గాయత్రి పేర్లను కూడ ఈ కేసులో పోలీసులు చేర్చారు. కారులోని జీపీఎస్ ఆధారంగా కేసును విచారించారు. ఫ్యాక్టరీ నుండి హత్య జరిగిన ప్రాంతానికి ట్రావెల్ చేసిన సెల్‌ఫోన్ డేటా ఆధారంగా కూడా పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు.
హత్య జరిగిన ప్రాంతంలో కోరాడ విజయ్ ఉన్నట్టుగా శాస్త్రీయ ఆధారాలను పోలీసులు సేకరించారు.సెటిల్‌మెంట్ చేసుకొందామని అనుచరులతో రాహుల్ ను విజయ్ పిలిపించాడని పోలీసులు అనుమానిస్తున్నారు
ఆర్ధిక లావాదేవీలే ఈ హత్యకు కారణంగా పోలీసులు చెబుతున్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శాస్త్రీయ ఆధారాలతో కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు.
కంపెనీలో 30 శాతం వాటా డబ్బుల కోసం విజయ్ కుమార్ రాహుల్ పై ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.ఈ విషయమై ఇద్దరి మధ్య విబేధాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలోని ఎదురుగా ఉన్న భవనంలోని సీసీటీవీ పుటేజీని కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.