గుంటూరు: సూపర్ పోలీస్... ముగ్గరు యువకులను ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్ (వీడియో)

By Arun Kumar PFirst Published Nov 28, 2021, 2:28 PM IST
Highlights

ముగ్గురు యువకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంటే తన ప్రాణాలకు తెగించి కాపాడాడు గుంటూరు జిల్లాకు చెందిన ఓ సూపర్ పోలీస్. 

గుంటూరు: పోలీసులంటే కఠినంగానే కాదు అవసరమైతే ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడతారు. ఇలా ఇటీవల మనస్థాపంతో బావిలో దూకిన వృద్ధురాలిని కాపాడిన గుంటూరు రూరల్ పోలీసులు తాజాగా కాలువలో కొట్టుకుపోతున్న యువకులను కాపాడారు. దీంతో ఉన్నతాధికారుల నుండే కాదు జిల్లా ప్రజల నుండి కూడా పోలీసులు ప్రశంసలు అందుకుంటున్నారు. 

నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ముగ్గురు యువకులను guntur district దుర్గి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేసే ప్రవీణ్ కుమార్ సమయస్ఫూర్తి కేవలం చొక్కానే ఊతంగా చేసుకుని కాపాడాడు. ఈ విషయం గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విశాల్ గున్నికి తెలియడంతో... కానిస్టేబుల్ ధైర్య సాహసాలను మెచ్చుకుని ప్రత్యేకంగా అభినందించారు.  

VIDEO

వివరాల్లోకి వెళితే... durgi police station పరిధిలోని అడిగొప్పుల గ్రామంలోని నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న బంధువుల వివాహానికి ముగ్గురు యువకులు బయలుదేరారు. మార్గమధ్యలో  నాగార్జున సాగర్ కుడి కాలువ వద్దకు వెళ్లగానే అందులో  స్నానం చేయడానికి ముగ్గురు యువకులు దిగారు.

read more  Heavy Rains: నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రాత్రి నుంచి భారీ వర్షాలు.. ఆందోళన చెందుతున్న ప్రజలు..

అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా వుంది. దీంతో నీటిలోకి దిగిన ముగ్గురు యువకులు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోసాగారు. ఇదే సమయంలో అటువైపు వెళుతున్న   దుర్గి కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్, ఎస్పీవో వెంకటేశ్వర్లు యువకులను గమనించి వారిని కాపాడారు.  

కానిస్టేబుల్ ప్రవీణ్ వెంటనే స్పందించి తోటి పోలీస్ వెంకటేశ్వర్లుతో కలిసి యువకులను కాపాడేందుకు పూనుకున్నాడు. తాను వేసుకున్న చొక్కానే ఊతంగా  చేసి సదరు యువకులకు అందించాడు. వారికి సూచనలిస్తూ తన ప్రాణాలకు తెగించి ఎట్టకేలకు యువకులను ఒడ్డుకు చేర్చాడు. 

భయంలో వణికిపోతున్న యువకులను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన కానిస్టేబుల్ ధైర్యం చెప్పారు.  యువకులు తల్లిదండ్రులను సమాచారం అందించి అప్పగించాడు. యువకుల ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్, ఎస్పీవో వేంకటేశ్వర్లును ఉన్నతాధికారులు అభినందించారు. అలాగే తమ పిల్లల ప్రాణాలను కాపాడిన పోలీసులకు తమ కుటుంబాలు ఎంతో రుణపడి ఉంటుందని యువకుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.

ఇదే గుంటూరులో ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా

ఇక ఇటీవల ఇదే గుంటూరు జిల్లాలో సేమ్ ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకుంది. స్నేహితుడి ఇంట్లో శుభకార్యానికి హాజరై తిరిగివెళుతూ ముగ్గురు యువకులు మృతి చెందారు. మార్గమధ్యలో గుంటూరు బ్రాంచి కెనాల్ లో స్నేహితులంతా ఈతకు దిగగా నీటిప్రవాహంలో ముగ్గురు కొట్టుకుపోయారు.  

 గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామంలో స్నేహితుడి ఇంట శుభకార్యానికి ఎనిమిదిమంది యువకులు హాజరయ్యారు. వీరంతా ఆటో, ద్విచక్రవాహనంలో గుంటూరుకు తిరుగుపయనం అయ్యారు. ఈ క్రమంలోనే కడగండ్ల వద్ద గుంటూరు బ్రాంచి కెనాల్ వద్ద ఆగిన వీరు సరదాగా నీటిలో ఈతకు దిగారు. 

అయితే కెనాల్ లో నీటి ప్రవాహం ఎక్కువగా వుండటంతో ఈతకు దిగిన ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు. మిగతా స్నేహితులు, స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినా నీటి ఉద్ధృతి ఎక్కువగా వుండటంతో సాధ్యపడలేదు. ఇలా కెనాల్ లో కొట్టుకుపోయింది జె.కోటేశ్వరరావు (భారత్‌పేట), పగడాల అశోక్‌ (జొన్నలగడ్డ), సామి సురేష్‌బాబు (నెహ్రూనగర్‌) గా గుర్తించారు. మృతుల్లో సురేష్ బాబు ఆటోడ్రైవర్ కాగా మిగతా ఇద్దరు ఓ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసేవారు.  

click me!