West Bengal Accident: అంత్యక్రియలకు వెళుతుండగా ఘోర ప్రమాదం... 17మంది దుర్మరణం

Arun Kumar P   | Asianet News
Published : Nov 28, 2021, 10:37 AM ISTUpdated : Nov 28, 2021, 11:04 AM IST
West Bengal Accident: అంత్యక్రియలకు వెళుతుండగా ఘోర ప్రమాదం... 17మంది దుర్మరణం

సారాంశం

పశ్చిమ బెంగాల్ ల ో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17మంది మృత్యువాతపడగా మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. 

కలకత్తా: పశ్చిమ బెంగాల్ లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి అంత్యక్రియల కోసం స్మశానానికి వెళుతుండగా వాహనం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. దీంతో  17మంది దుర్మరణం పాలయ్యారు. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. west bengal ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బాగ్దాకు చెందిన కొందరు శనివారం రాత్రి ఓ వాహనంలో మృతదేహాన్ని తీసుకుని అంత్యక్రియలకు బయలుదేరారు. అయితే రోడ్డుపై వేగంగా వెళుతున్న సమయంలో సదరు వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. రోడ్డు పక్కన నిలిపివున్న ట్రక్కును అంత్యక్రియలకు వెళుతున్న వాహనం అతివేగంతో ఢీకొట్టింది.   

ఈ road accident లో అంత్యక్రియల కోసం వెళుతున్న 17మంది అక్కడిక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను కాపాడి దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. వీరి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు తెెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

read more  పలాసలో ప్రమాదం... 108 అంబులెన్స్ ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన రైలు

రాత్రి సమయంలో అధికంగా కురుస్తున్న పొగమంచే ఈ ప్రమాదానికి కారణమయి వుంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించుకున్నారు. డ్రైవర్ అతివేగంగా వాహనాన్ని నడపడంతో ప్రమాద తీవ్రత ఎక్కవగా వుండి చాలా ప్రాణాలు బలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

తెలంగాణ ఘోర రోడ్డు ప్రమాదం

ఇదిలావుంటే తెలంగాణలో ఇలాంటి ఘోర ప్రమాదమే చోటుచేసుకోగా నలుగురు మృత్యువాతపడ్డారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు వద్ద ఓ కారును చెట్టు ఢీకొనడంతో నలుగురు మరణించారు మరొకరు గాయపడ్డారు. మృతులు కరీంనగర్ లోని జ్యోతినగర్ వాసులు. ఖమ్మం నుండి కారులో తిరిగి వస్తుండగా ఆ ప్రమాదం జరిగింది.

గత శుక్రవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి మానకొండూరు పోలీసు స్టేషన్ సమీపంలో గల చెట్టును ఢీకొట్టింది. దాంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం గాయపడిన వ్యక్తిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని కల్లూరులో దశ దినకర్మకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మృతులను శ్రీనివాసరావు, శ్రీరాజ్, కొప్పుల బాలాజీ, జలందర్ లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో జలంధర్ కారును నడుపుతన్నాడు. డ్రైవర్ నిద్ర మత్తులో కారు నడపడం వల్లనే ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. నలుగురు కూడా అక్కడికక్కడే మరణించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కృష్ణా రెడ్డి తెలిపారు. గాయపడిన వ్యక్తిని గురుకుల సుధాకర్ రావుగా గుర్తించారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?