పోలీసులు చితకబాదడంతో ప్రాణాపాయ స్థితిలో దళిత నేత... ఏం జరిగినా జగన్ దే బాధ్యత: అచ్చెన్నాయుడు (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Nov 21, 2021, 11:37 AM ISTUpdated : Nov 21, 2021, 11:44 AM IST
పోలీసులు చితకబాదడంతో ప్రాణాపాయ స్థితిలో దళిత నేత...  ఏం జరిగినా జగన్ దే బాధ్యత: అచ్చెన్నాయుడు (వీడియో)

సారాంశం

చంద్రబాబు సతీమణిపై వైసిపి నాయకుల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేపట్టిన దళిత నాయకుడు పల్లి శ్రీనుని పోలీసులు అరెస్ట్ చేసి తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేసారు.

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై వైసిపి నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలానికి చెందిన టీడీపీ నాయకులు కూడా ఆందోళన చేపట్టారు. అయితే ఆందోళనకు దిగిన టిడిపి దళిత నాయకుడు పల్లి శ్రీనుని పోలీసులు అరెస్ట్ చేసి తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. 

''దళిత నాయకుడు palli srinu ని పోలీసులు కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర అసెంబ్లీలో ysrcp leaders చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన తెలియజేస్తే తప్పేంటి? శాంతియుతంగా నిరసన తెలుపున్న శ్రీనుని పోలీసులు తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. శ్రీనుకు ఏదయినా జరిగితే cm ys jagan, హోమంత్రి mekathoti sucharitha, డీజీపీ goutham sawang దే బాధ్యత'' అని kinjarapu atchannaidu హెచ్చరించారు. 

వీడియో

''శ్రీనును పోలీసులు వెంటనే విడిచిపెట్టడంతో పాటు ప్రభుత్వమే అతడికి మెరుగైన వైద్యం అందించాలి. దీనికి బాద్యులైన పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పోలీసులు ఇకనైనా TDP నేతలు, కార్యకర్తల్ని వేధించడం మానుకోవాలి. లేకపోతే భవిష్యత్తు లో తీవ్ర పరిణామాలు తప్పవు'' అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

read more  Chandrababu Naidu: ప్రెస్‌మీట్‌లో బోరున విలపించిన చంద్రబాబు నాయుడు.. వెక్కి వెక్కి ఏడ్చిన వైనం

గత శుక్రవారం ap assembly లో చోటుచేసుకున్న పరిణామాలతో chandrababu naidu తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన ఆవేదనను రాష్ట్రప్రజలకు తెలియజేసేందుకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలోనే భావోద్వేగానికి లోనయిన ఆయన బోరున విలపించారు. తన భార్య nara bhuvaneshwari గురించి వైసిపి నాయకులు నిండుసభలో అవమానకరంగా మాట్లాడారంటూ చంద్రబాబు వెక్కి వెక్కి కళ్లనీళ్లు పెట్టుకున్నారు.

తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదంటూ ఆవేదన వ్యక్తం చేసారు.  నేడు జరిగిన ఘటనపై ఏం చెప్పాలో కూడా అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. తనకు పదవులు అవసరం లేదని అన్నారు. క్షేత్ర స్థాయిలో తెల్చుకున్న తర్వాతే తిరిగి అసెంబ్లీకి వెళ్తానని చెప్పారు. తిరిగి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని చంద్రబాబు శపధం చేసారు. 

నా భార్య ఆమె వ్యక్తిగత జీవితం కోసం, నా కోసం మాత్రమే పని చేసింది. ముఖ్యమంత్రి భార్యగా ఉన్న సమయంలో ఆమె ఏ రోజు కూడా రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ప్రజల కోసం ఇంటికి రాకుండా ఎంతకాలం పనిచేసినా నా భార్య ప్రోత్సహించింది. అలాంటిది ఆమె గురించి అవమానకరంగా మాట్లాడటాన్ని నేను తట్టుకోలేకపోయాను'' అంటూ చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు. 

read more  తలుపులు పగులగొట్టి మరీ... అర్దరాత్రి అరెస్ట్ అవసరమేంటి?: కూన అరెస్ట్ పై అచ్చెన్న సీరియస్

వైసిపి నాయకుల అనుచిత వ్యాఖ్యలను విని, చంద్రబాబు కంటతడిని పెట్టడాన్ని చూసి టిడిపి శ్రేణులు తట్టుకోలేకపోయారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేస్తూ ఆందోళనకు దిగారు. ఇలా ఆందోళనకు దిగిన టిడిపి శ్రేణులపై పోలీసులు ప్రతాపం చూపించారు. ఇలా శాంతియుత ఆందోళనకు దిగిన దళిత నాయకుడు పల్లి శ్రీనును తీవ్రంగా కొట్టడాన్ని టిడిపి నాయకులు ఖండిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్