ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. నెల్లూు, చిత్తూరు, కడప జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీటిలోనే మునిగాయి.
కడప: కడప జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ నీటిలో మునిగిపోయాయి. నీటిలో ఉన్నభవనాలు కుప్పకూలిపోతున్నాయిత.రెండు రోజులుగా కడప జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా పాపాగ్ని నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. కమలాపురం, వల్లూరు మార్గ మధ్యలోని వంతెన అర్ధరాత్రి తర్వాత కుప్పకూలింది. అయితే ఈ సమయంలో వంతెనపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ వంతెన కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వెలిగల్లు జలాశయం నాలుగు గేట్లు ఎత్తారు. దీంతో వరదనీరు భారీగా వంతెనపై అంచువరకు రెండు రోజులుగా ప్రవహించడంతో వంతెన బాగా కుంగిపోయింది. దీంతో ఈ వంతెనపై ప్రమాదం రాకపోకలకు ప్రమాదం కలుగుతుందని భావించారు. అర్ధరాత్రి వంతెన కుప్పకూలింది.
undefined
also read:AP Rains Update: రాగల మూడుగంటలు ఏపీ హై అలర్ట్... ఆ ప్రాంతాల్లో కుండపోత హెచ్చరిక
ఏడు మీటర్లకు పైగా వెంతన కూలడంతో కిలోమీటర్ దూరంలోనే వాహనాలను నిలిపివేశారు. కడప నుండి అనంతపురం వెళ్లే జాతీయ రహదారి కావడంతో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు.
కడప నుండి తాడిపత్రికి వెళ్లే ఆర్టీసీ బస్సులను , ఇతర వాహనాలను ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, మైదుకూరు మీదుగా మళ్లించారు.
కడపలో కుప్పకూలిన మూడంతస్థుల భవనం
కడప నగరంలో heavy rains లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగి పోయాయి. ఆదివారం నాడు తెల్లవారుజామున kadapa పట్టణంలోని రాధాకృష్ణ నగర్‌లో మూడంతస్తుల భవనం కుప్పకూలింది.నిన్ననే ఈ భవనం పక్కనే మరో భవనం కూలింది. మూడంతస్తుల భవనంలో చిక్కుకొన్న నాలుగేళ్ల చిన్నారి సహా ఆమె తల్లిని సురక్షితంగా బయలకు తీసుకొచ్చారు. ఈ భవనంలో 13 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ భవనం శిథిలావస్థకు చేరుకొంది. అయితే ఈ భవనాన్ని ఖాళీ చేయాలని కార్పోరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చానా కూడ యాజమాన్యం స్పందించలేదని అధికారులు చెబుతున్నారు.ఏపీ రాష్ట్రంలోని nellore, chittoor కడప జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారుల గుండా వరద నీరు ప్రవహిస్తోంది.చిత్తూరు, నెల్లూరు జిల్లాలను కూడా వర్షాలు ముంచెత్తాయి. టెంపుల్ సిటీ తిరుపతిలో కుండపోత వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. శ్రీవారి దర్శనానికి వెళ్లే మెట్ల మార్గంలో కూడ రాళ్లు విరిగిపడ్డాయి. మెట్ల మార్గాన్ని పునరుద్దరించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
ఇక కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్లతో పాటు నడకమార్గాల్లో వరదనీటి ఉదృతి ప్రమాదాలకు దారితీసింది. ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చింది. అలాగే నడకమార్గంలో వరదనీటి ప్రవాహం ఎక్కువగా వుండటంతో ఆ మార్గాలను కూడా మూసివేసారు. దీంతో కొండపైకి రాకపోకలు నిలిచిపోయారు. అయితే తాజాగా వర్షతీవ్రత తగ్గి పరిస్థితి సాధారణంగా మారడంతో యధావిధిగా అన్ని మార్గాల్లో రాకపోకలు సాగుతున్నాయి.