తలుపులు పగులగొట్టి మరీ... అర్దరాత్రి అరెస్ట్ అవసరమేంటి?: కూన అరెస్ట్ పై అచ్చెన్న సీరియస్

Arun Kumar P   | Asianet News
Published : Nov 21, 2021, 09:47 AM ISTUpdated : Nov 21, 2021, 10:23 AM IST
తలుపులు పగులగొట్టి మరీ... అర్దరాత్రి అరెస్ట్ అవసరమేంటి?: కూన అరెస్ట్ పై అచ్చెన్న సీరియస్

సారాంశం

శ్రీకాకుళం జిల్లాకు చెందిన టిడిపి నాయకులు కూన  రవికుమార్ అరెస్ట్ ను ఖండిస్తూ ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు.   

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అరెస్ట్ పై ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తుంటే ప్రజల్ని కాపాడటంపై దృష్టిపెట్టాల్సిన సీఎం జగన్ టిడిపి నాయకుల అరెస్టులపై దృష్టిపెట్టడం దారుణమన్నారు atchannaidu. 

''అర్థరాత్రి రెండువందల మంది పోలీసులతో వెళ్లి kuna ravikumar ను అక్రమంగా అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటి.? తలుపులు పగల గొట్టి ఇంట్లోకి చొరబడటం మీ అరాచకానికి అద్దంపడుతోంది. రవికుమార్ ను తక్షణమే విడుదల చేయాలి'' అని అచ్చెన్న డిమాండ్ చేసారు. 

''రాష్ట్రంలో కావాలనే cm ys jagan ఉద్రిక్తలు సృష్టిస్తున్నారు. మహిళల్ని కించపరిచే హక్కు YSRCP కి ఉంటే... వాటిపై నిరసన తెలిపే హక్కు TDP కి వుంది. అయినా Havy rains కురిసి వరదలతో రాయలసీమ అతలాకుతలమై ప్రజలు ప్రాణాలు విడుస్తుంటే దానిపై దృష్టిపెట్టకుండా టీడీపీ నేతల్ని ఎలా అరెస్టు చేయాలి... కార్యకర్తల్ని ఏవిధంగా హత్యలు చేయాలని జగన్ ఆలోచిస్తున్నారు. టీడీపీ నేతలను అరెస్టులు చేస్తే వరదల్లో చనిపోయినవారు, నష్టపోయిన పంటలు తిరిగిరావు'' అని అచ్చెన్న ఎద్దేవా చేసారు.

read more  అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా... టిడిపి మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అరెస్ట్

''దేశంలో జగన్ లాంటి డైవర్షన్ సీఎం ఎక్కడా లేడు. నిండు సభలో చేసిన తప్పులకు క్షమాపణలకు చెప్పకుండా వాఖ్యల పట్ల ఆందోళన చేసిన వారిని అక్రమంగా అరెస్టులు చేస్తారా? వివేకానందరెడ్డి హత్య జగన్ కుటుంబానిదే అని తేలడంతో జనం ఉమ్మేస్తారని తెలిసి అక్రమ అరెస్టులకు ప్రేరేపిస్తున్నారు. పోలీసులు కూడా బాధ్యతయుతంగా వ్యవహరించాలి. జగన్ రెడ్డి చెప్పినట్లు నడుచుకుంటే పోలీసులే రాబోయే రోజుల్లో ఇబ్బందులు  పడతారు'' అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

ఈ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నీచంగా తయారైందని, పదవుల కోసం మోకరిల్లే దుస్థితికి వచ్చందని హెడ్ కానిస్టేబుల్ విజయకృష్ణ రాజీనామా చేసి చెప్పారు. మీరు చేయమన్నట్లు అక్రమ అరెస్టులు చేయబోమని డీజీపీ, ముఖ్యమంత్రికి మిగతా పోలీసులు చెప్పాలి'' అన్నారు.

''జగన్ పతనం ప్రారంభమై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఎన్ని దాడులు, అక్రమ అరెస్టులు చేయించినా  నీ సమయం మరో రెండున్నరేళ్లే అని గుర్తు పెట్టుకో జగన్ రెడ్డి. టీడీపీ వచ్చాక మీపై కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తే జైళ్లు కూడా సరిపోవు'' అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

read more  గాల్లోంచి నేలకు దిగు జగన్.. అప్పుడే వరద కష్టాలు కనిపిస్తాయ్..: నారా లోకేష్

శనివారం అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శ్రీకాకుళం జిల్లా టిడిపి అధ్యక్షులు కూన రవికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. శ్రీకాకుళం పట్టణంలోని శాంతినగర్ కాలనీలో సోదరుడి ఇంట్లో కూన తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అర్దరాత్రి కూన నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులను దూషించిన కేసులో కూన రవికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్ట్ తర్వాత ఆయనను పోలీసులు ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం. అరెస్ట్ చేసే సమయంలో కుటుంబసభ్యులను పోలీసులు భయబ్రాంతులకు గురిచేసారని... అర్ధరాత్రి ఇంట్లోకి దూరి అరెస్ట్ చేయడం దారుణమని కూన సోదరుడు ఆందోళన వ్యక్తం చేసారు. 

 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్