సీఎం జగన్‌కు ప్రధాని మోడీ... గులాబ్ తుఫాన్‌పై ఆరా, అండగా వుంటామని హామీ

Siva Kodati |  
Published : Sep 26, 2021, 03:34 PM ISTUpdated : Sep 26, 2021, 03:39 PM IST
సీఎం జగన్‌కు ప్రధాని మోడీ... గులాబ్ తుఫాన్‌పై ఆరా, అండగా వుంటామని హామీ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్  జగన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. గులాబ్ తుఫాన్ నేపథ్యంలో సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన సన్నద్ధతపై ప్రధాని.. జగన్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని మోడీ హామీ ఇచ్చారు. అందరూ క్షేమంగా వుండాలని ప్రధాని ఆకాంక్షించారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్  జగన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. గులాబ్ తుఫాన్ నేపథ్యంలో సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన సన్నద్ధతపై ప్రధాని.. జగన్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని మోడీ హామీ ఇచ్చారు. అందరూ క్షేమంగా వుండాలని ప్రధాని ఆకాంక్షించారు. 

మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను ఆంధ్ర ప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోందని వాతావరణ శాఖ ప్రకటించింది. శనివారం అర్ధరాత్రి తీవ్ర తుఫానుగా మారి శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి తూర్పుగా 350కి.మీ,  గోపాలపూర్ కు 310కి.మీ దూరంలో తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండంగా ఉన్నపుడు గంటకు 14కి.మీ వేగంతో తీరం వైపు కదిలిన తుఫాను తుఫానుగా మారిన తర్వాత వేగం తగ్గి గంటకు 7కి.మీ వేగంతో కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. 

అయితే ఈ గులాబ్ తుఫాను వేగం పుంజుకుని నేటి(ఆదివారం) మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది పశ్చిమంగా పయనిస్తున్నందున శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి ఉత్తరంగా తీరం దాటే అవకాశాలున్నాయని... పరిస్థితుల్లో మరింత మార్పు వస్తే సోంపేటలోని బారువ వద్ద తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఈ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, తెలంగాణ, దక్షిణ ఒడిషాలో కొన్నిచోట్ల భారీనుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తమయ్యింది. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు... మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం వుందని విపత్తుల శాఖ కమీషనర్ కె.కన్నబాబు తెలిపారు.  

ఇప్పటికే గులాబ్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ‘ఆరెంజ్‌’ హెచ్చరికలను జారీ చేశారు. ఈ తుపాన్‌ ప్రభావం ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుంది. మిగిలిన కోస్తా జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?