గుంటూరు: సాంస్కృతిక కార్యక్రమాల పేరిట... యువతిపై గ్రామ పెద్ద అత్యాచారం

Arun Kumar P   | Asianet News
Published : Sep 26, 2021, 11:14 AM ISTUpdated : Sep 26, 2021, 11:54 AM IST
గుంటూరు: సాంస్కృతిక కార్యక్రమాల పేరిట... యువతిపై గ్రామ పెద్ద అత్యాచారం

సారాంశం

పెద్దమనిషిగి చెలామణి అవుతున్న ఓ వ్యక్తి యువతిపై అత్యాచారానికి పాల్పడిన దారుణం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

గుంటూరు: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా... పోలీసులు ముందస్తు జాగ్రత్తలెన్ని తీసుకున్నా మహిళలపై మాత్రం అఘాయిత్యాలు ఆగడం లేదు. తెలుగురాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రతిరోజూ ఏదో ఒకచోట చిన్నారులు, యువతులు, మహిళలే కాదు చివరకు వృద్ధులను కూడా వదలడం లేదు కామాంధులు. ఆడబిడ్డలకు ఆకతాయిల నుండే కాదు సొంత కుటుంబసభ్యుల నుండి వేధింపులు తప్పడంలేదు. ఇలా తాజాగా ఓ యువతి గ్రామపెద్ద చేతిలో అత్యాచారానికి గురయ్యింది. ఈ దారుణం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామంలో ఓ యువతి కుటుంబంతో కలిసి నివాసముండేది. అయితే అదే గ్రామంలో పెద్దమనిషిగా చెలామణి అవుతున్న ఓ వ్యక్తి కన్ను ఆ యువతిపై పడింది. ఎలాగయినా యువతిని అనుభవించాలని భావించిన అతడు మాయమాటలతో నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డారు. 

read more  బాలికపై చిన్నాన్న కుమారుడి కన్ను..!

గ్రామంలోని చిన్నారులను సాంస్కృతిక కార్యక్రమాల కోసం సిద్దం చేయాలని సదరు గ్రామపెద్ద యువతిని కోరాడు. మంచి పని కోసమే కదా అని యువతి కూడా అందుకు ఒప్పుకుంది. అయితే ఈ నెపంతో యువతితో చనువు పెంచుకున్న సదరు పెద్దమనిషి పెళ్లి చేసుకుంటానని యువతికి మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

అయితే తాజాగా యువతి తనపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ పెద్దమనిషి అసలురంగు బయటపడింది. పెళ్లిచేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారానికి పాల్పడిన గ్రామ పెద్ద మోసం చేశాడంటూ బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పెదకూరపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?