ప్లీజ్ మోదీజీ ... ఆ రాజధానిగా విశాఖ ... మార్చండి : వైజాగ్ లో ఆసక్తికర ప్లెక్సీలు (వీడియో)

By Arun Kumar PFirst Published Feb 29, 2024, 1:35 PM IST
Highlights

విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలతో ఆసక్తికర ప్లెక్సీలు వెలిసాయి. విశాఖకు వున్న చెడ్డపేరును తొలగించాాలని కోరుతూ జన జాగరణ సమితి ఈ ప్లెక్సీలు ఏర్పాటుచేసింది. ఇందులో ఏముందంటే... 

విశాఖపట్నం : సముద్ర తీర అందాలు, ప్రకృతి సోయగాలకు నిలయం విశాఖపట్నం. అయితే ఈ అందాల వెనక ఓ చీకటి సామ్రాజ్యం నడుస్తోంది. దేశంలో అత్యధికంగా గంజాయి సాగు జరుగుతున్న ప్రాంతం విశాఖనే. ఇక్కడి గిరిజనప్రజల అమాయకత్వాన్ని, ఆర్థిక అవసరాలను అదునుగా చేసుకుని కొన్ని ముఠాలు అక్రమంగా గంజాయిని సాగుచేయిచేస్తున్నాయి. ఇక్కడి నుండి గంజాయిని దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నాయి. దీంతో విశాఖకు గంజాయి రాజధానిగా చెడ్డపేరు వుంది.ఈ చెడ్డపేరును తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీకి కోరుతూ విశాఖలో ప్లెక్సీలు వెలిసాయి. 

 ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల వేళ విశాఖలో గంజాయి సమస్యను పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు జన జాగరణ సమితి వినూత్న ప్రయత్నం చేసింది. విశాఖ ఏజన్సీలో పండించే గంజాయి దేశవ్యాప్తంగా సరఫరా అవుతోంది... కాబట్టి దీన్ని దేశ సమస్యగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని కోరుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ గంజాయి ముఠాల ఆట కట్టించడం కేంద్రంతోనే  సాధ్యమవుతుందని జనజాగరణ సమితి పేర్కొంది. కాబట్టి ఈ గంజాయి సాగు, స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ప్రధాని చొరవ చూపించాలంటూ మోదీ పోటోతో విశాఖలో ప్లెక్సీలు వెలిసారు. 

ఈ సందర్భంగా జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతే... దేశ సంపద అయిన యువశక్తిని గంజాయి నిర్వీర్యం చేస్తోందని అన్నారు. ప్రపంచంలో అత్యధిక శాతం యువతను కలిగివున్న దేశం భారత్... అలాంటిది ఇక్కడే లక్షలాదిమంది గంజాయికి బానిస అవుతున్నారని అన్నారు. ఈ మహమ్మారి బారినపడి యువత బంగార భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారని వాసు ఆందోళన వ్యక్తం చేసారు. 

వీడియో

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థితి మరింత దారుణంగా వుందని... ఎక్కడ పడితే అక్కడ గంజాయి అందుబాటులో వుంటుందన్నారు.  దీంతో స్కూల్ పిల్లల నుండి యూనివర్సిటీ విద్యార్థుల వరకు గంజాయి బానిస అవుతున్నారన్నారు. కానీ గంజాయి సాగు, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడం రాష్ట్ర ప్రభుత్వంతో సాధ్యం కాదు... కాబట్టి కేంద్ర రంగంలోకి దిగాలని జన జాగరణ సమితి కోరింది. 

దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు విశాఖ ఏజెన్సీతో ముడిపడి ఉంటోందని తెలిపారు. ఇటీవల దేశవ్యాప్తంగా 7లక్షల కేజీల గంజాయి పట్టుబడితే అందులో 5 లక్షల కేజీలు విశాఖ ఏజెన్సీకి చెందినదిగా ఇటీవల వెలువడిన అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాబట్టి విశాఖలో గంజాయి సాగును జాతీయ సమస్యగా గుర్తించాలని... దీన్ని అరికడతామని బిజెపి ఎన్నికల ద్వారా హామీ ఇవ్వాలని ప్రధాని మోదీని కోరింది జన జాగరణ సమితి. ఈ ప్లెక్సీలు మధురవాడ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దర్శనమిస్తుండగా అటువైపు వెళుతున్నవారు ఆసక్తిగా గమనిస్తున్నారు. 

click me!