ఎన్నికల మేనిఫెస్టో‌పై కసరత్తు: పార్టీ నేతలతో జగన్ చర్చలు

By narsimha lodeFirst Published Feb 29, 2024, 12:45 PM IST
Highlights


ఎన్నికల మేనిఫెస్టో‌పై  వై.ఎస్. జగన్ కేంద్రీకరించారు. మేనిఫెస్టో‌లో చేర్చాల్సిన అంశాలపై  పార్టీ నేతలతో  జగన్ చర్చించనున్నారు.

అమరావతి: ఎన్నికల మేనిఫెస్టో‌పై యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ) పై ఫోకస్ పెట్టింది.  గురువారంనాడు మధ్యాహ్నం పార్టీ సీనియర్లతో  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  సమావేశం కానున్నారు.మేనిఫెస్టో‌పై  జగన్ చర్చించనున్నారు.

2019 ఎన్నికల సమయంలో నవరత్నాలను  వైఎస్ఆర్‌సీపీ ప్రకటించింది. నవరత్నాలతో పాటు క్షేత్రస్థాయి నుండి వచ్చిన అభ్యర్థనల మేరకు  మరికొన్ని పథకాలను కూడ  మేనిఫెస్టో‌లో చేర్చే విషయమై పార్టీ నేతలతో జగన్ చర్చించనున్నారు.

also read:తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను కొనసాగించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ పథకాలకు తోడుగా కొత్త పథకాలు చేర్చాలని ఆ పార్టీ భావిస్తుంది. మహిళలను ఆకర్షించేలా ఈ పథకాలకు   ఆ పార్టీ నాయకత్వం వ్యూహ రచన చేస్తుంది.రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ మేనిఫెస్టోలో పెట్టే విషయమై  పార్టీ నేతలతో  చర్చించనున్నారు.మధ్యపాన నిషేధంపై కూడ మేనిఫెస్టో‌లో  స్పష్టత ఇవ్వనుంది.

also read:బెంగాల్ లో టీఎంసీ నేత అరెస్ట్: సందేశ్ ఖాళీలో ఆందోళనలెందుకు, ఎవరీ షేక్ షాజహాన్ ?

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం లేకపోలేదు. ఈ విషయమై  ఈ మాసంలో  ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.  ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేనాటికి  మేనిఫెస్టో‌ను విడుదల చేయాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది.

also read:ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు: ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేయనున్న అధిష్టానం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో  ఒంటరిగా పోటీ చేయనుంది వైఎస్ఆర్‌సీపీ. తెలుగుదేశం, జనసేనలు కూటమిగా ఏర్పడి పోటీ చేయనున్నట్టుగా ప్రకటించాయి.ఇప్పటికే  99 మంది అభ్యర్థులను  ఈ రెండు పార్టీలు ప్రకటించాయి. ఈ రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో  కూడ త్వరలోనే విడుదల కానుంది.

click me!