పవన్ కల్యాణ్ గారు... సీఎం పదవికోసం ఆ సాహసం చేయాల్సింది..: ముద్రగడ 

By Arun Kumar PFirst Published Feb 29, 2024, 11:53 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాపు నేత ముద్రగడ పద్మనాభం జనసేనాని పవన్ కల్యాణ్ కు ఆసక్తికర లేఖ రాసారు. చంద్రబాబు పరపతిని పెంచిందే పవన్.. అలాంటిది ఆయన సీఎం పదవి విషయం వెనక్కి తగ్గడం బాధాకరమంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేాసారు. 

అమరావతి : ఎన్నికల వేళ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు వైసిపి, తిరిగి అధికారాన్ని దక్కించుకునేందుకు టిడిపి- జనసేన కూటమి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ కు కాపునేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతుండటం కూటమిని కలవరపెడుతోంది. ఇప్పటికే కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరి రామజోగయ్య ఇక పవన్ కల్యాణ్ కు సలహాలు ఇవ్వబోనని ప్రకటించగా తాజాగా మరో కాపు నేత ముద్రగడ పద్మనాభం కూడా అలాంటి వ్యాఖ్యలే చేసారు. 

పవన్ కల్యాణ్ తో కలిసి పనిచేసేందుకు తాను సిద్దమయ్యాయని... కానీ ఆయనే తనను దూరం పెట్టారని ముద్రగడ తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు ఓసారి, ఇటీవల మరోసారి కలుస్తానని ఆయనే కబురు పంపారు... కానీ ఏమయ్యిందో తెలీదు ఇంతవరకు ఒక్కసారి కూడా కలవలేదని అన్నారు. కాపులతో పాటు అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం జనసేన పార్టీతో కలిసి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించాను... పవన్ తో స్వలాభం ఆశించకుండా ప్రజాసేవ చేయించాలని అనుకున్నట్లు ముద్రగడ తెలిపారు. 

నేను, పవన్ కలవాలని యావత్ జాతి కోరుకుంది... అందువల్లే నా గతం, బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు మరిచి ఆయనతో  ప్రయాణం చేయడానికి సిద్దమైనట్లు ముద్రగడ పేర్కొన్నారు. ఇద్దరం కలిసి రాష్ట్రంలో కొత్త రాజకీయ ఒరవడి సృష్టించాలని ఆశించాను... కానీ దురదృష్టవశాత్తు అది ఫలించలేదని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేసారు. 

Also Read  చంద్రబాబు, పవన్ కృష్ణార్జునులు... మోదీ జెండాపై కపిరాజు : రఘురామ కామెంట్స్ అర్థమిదేనా?

తనలా గ్లామర్ లేదనో, ప్రజల్లో పరపతి లేదనో పవన్ తనను దూరం పెట్టాడు... తనను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిలా, తుప్పు పట్టిన ఇనుములా భావించి వుంటారని ముద్రగడ తెలిపారు. అయినా పవన్ సొంతంగా ఏ నిర్ణయమూ తీసుకోలేరు... ఎన్నో చోట్ల అనుమతి తీసుకోవాల్సి వుంటుంది...  అందువల్లే తనను దూరం పెట్టివుంటాడని ముద్రగడ అభిప్రాయపడ్డారు.  

అంతేకాదు టిడిపి, జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటుపై కూడా ముద్రగడ కామెంట్స్ చేసారు.  చంద్రబాబు జైలుకు వెళ్ళినపుడు టిడిపి నేతలే బయపడి బయటకు రాలేరు... కానీ పవన్ ధైర్యంగా ఆయనకోసం రోడ్డెక్కారని గుర్తుచేసారు. ఇలా చంద్రబాబును జైలుకెళ్ళి కలిసి భరోసా ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు... ఇది చరిత్ర తిరగరాసినట్లు అయిందన్నారు. ఇలా చంద్రబాబు పరపతి విపరీతంగా పెరగడానికి పవన్ కారణమని బల్లగుద్ది చెప్పొచ్చన్నారు. ఇలాంటి నాయకుడు ఉన్నతస్థానంలో వుండాలని ప్రజలంతా కోరుకున్నారు...కానీ మీరు మాత్రం టిడిపి ముందు తగ్గారని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేసారు. 

టిడిపితో పొత్తు బాగానే వుంది... కానీ పవర్ షేరింగ్ విషయంలో మరింత గట్టిగా ప్రయత్నించాల్సిందని పవన్ కు సూచించారు ముద్రగడ.  80 అసెంబ్లీ సీట్లతో పాటు ముందుగా ముఖ్యమంత్రి తానే అవుతానని పవన్  కోరి వుండాల్సిందన్నారు. కానీ ఆ సాహయం పవన్ చేయకపోవడం బాధాకరమని అన్నారు. ఏదేమైనా జనసేన పోటీచేసే 24 స్థానాల్లో గెలుపుకోసం తన అవసరం రాదు... రాకూడదని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. 

click me!