పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

By Rajesh KarampooriFirst Published Mar 26, 2024, 8:28 AM IST
Highlights

Peddireddy Ramachandra Reddy Biography :పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని రాజకీయ నాయకుడు. రాయలసీమ ముఖ్యంగా చిత్తూరు రాజకీయాల్లో ఆయన పేరు బాగా వినిపిస్తుంది.  సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత,  రాజకీయ జీవిత విశేషాలు మీకోసం.. 

Peddireddy Ramachandra Reddy Biography :పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని రాజకీయ నాయకుడు. రాయలసీమ ముఖ్యంగా చిత్తూరు రాజకీయాల్లో ఆయన పేరు బాగా వినిపిస్తుంది. ప్రజలకు అత్యంత చేరువైన నాయకుడిగా గుర్తింపు సాధించారు. అటు వ్యాపారాల్లో, ఇటు రాజకీయాల్లో రాణిస్తోన్న అపర చాణిక్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏపీ రాజకీయాల్లో ఐకాన్ నేతలుగా చెప్పుకునే చంద్రబాబు, వైయస్ రాజశేఖర్ రెడ్డిలా సమకాలికుడిగా రాజకీయాల్లోకి వచ్చారు.  సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత,  రాజకీయ జీవిత విశేషాలు మీకోసం.. 

బాల్యం, విద్యాభ్యాసం

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. 1952 జూలై 1న పెద్దిరెడ్డి లక్ష్మారెడ్డి దంపతులకు చిత్తూరు జిల్లా సదుం మండలంలోని ఎర్రతివారిపల్లెలో జన్మించారు. పెద్దిరెడ్డి వారిది ముందు నుండే ధనిక కుటుంబం. ఆయన విద్యాభ్యాసం స్వంత జిల్లాలోనే సాగింది. ఆయన 1975లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి సోషియాలజీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆయన ఎస్వీ యూనివర్సిటీలోని యూనివర్సిటీ చదువుకుంటున్న రోజుల్లోనే స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర పోటీ ఉన్న యునానిమల్స్ గా ఎన్నికయ్యారు. 

ప్రారంభ జీవితం

విద్యాభ్యాసం పూర్తయిన తరువాత వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. తొలుత కన్స్ట్రక్షన్ విభాగంలో అడుగుపెట్టి ఆయన ఆ తరువాత కాలం ఇరిగేషన్, రియల్ ఎస్టేట్ రంగాల్లో తన వ్యాపారాన్ని విస్తరించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి తక్కువ కాలంలోనే మంచి వ్యాపారవేత్తగా పేరు సంపాదించుకున్నారు. 

రాజకీయ జీవితం 

పెద్దిరెడ్డి రాజకీయ ప్రస్థానం ఎస్వీ యూనివర్సిటీ వేదికగా ప్రారంభమైందని చెప్పాలి. ఆయన ఎస్వీ యూనివర్సిటీలోని యూనివర్సిటీ చదువుకుంటున్న రోజుల్లోనే స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర పోటీ ఉన్న యునానిమల్స్ గా ఎన్నికయ్యారు. పెద్దిరెడ్డికి మాజీ రాష్ట్రపతి దివంగత నేత నీలం సంజీవరెడ్డి అంటే ఎంతో అభిమానం. అప్పట్లో ఎమర్జెన్సీ తర్వాతే జరిగిన ఎన్నికల్లో నంద్యాల నుంచి నీలం సంజీవరెడ్డి జనతా పార్టీ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నీలం సంజీవరెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. ఇలా తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన పెద్దిరెడ్డి పై నీలం సంజీవరెడ్డికి ప్రత్యేక అభిమానం ఉండేది. అందుకే 1978లో జరిగిన ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గ జనతా పార్టీ ఎమ్మెల్యే టికెట్ ను పెద్దరెడ్డికి ఇప్పించారని టాక్. కానీ, ఈ ఎన్నికల్లో పెద్దిరెడ్డి ఓటమిపాలయ్యారు. 

కాంగ్రెస్ లోచేరిక

ఆ తర్వాత పెద్దిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఇలా పార్టీలో పని చేస్తున్న సమయంలో  1985లో ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. కానీ, ఈ ఎన్నికల్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమిపాలయ్యారు. అయినా వెనుతిరిగి చూడలేదు. 1989 లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఆయనకు టికెట్ ఇవ్వగా  ఈసారి ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. ఇలా తొలిసారి 1989 ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తరువాత 1994 ఎన్నికల్లో ఆయన పీలేరు నుంచి పోటీ చేస్తారు. కానీ, ఈ ఎన్నికల్లోనూ ఆయన ఓటమి పాలయ్యారు. 

అనంతరం 1999, 2004 ఎన్నికల్లో వరుసగా పీలేరు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు.. 1995 నుంచి 9 సంవత్సరాల పాటు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2008లో పిసిసి ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యారు. 2009 ఎన్నికల్లో ఆయన పుంగనూరు సెగ్మెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. వరుసగా రెండోసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో పెద్దిరెడ్డిని తన కేబినేట్ లోకి తీసుకున్నారు. అడవులు, పర్యావరణ శాఖ, సాంకేతిక శాఖ మంత్రిగా పని చేశాడు. కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో అదే శాఖల్లో సాగారు. 

వైసీపీలో చేరిక

వైయస్సార్ కు ఎంతో నమ్మకంగా ఉండే పెద్దిరెడ్డి.. వైఎస్ జగన్  పై కాంగ్రెస్ కక్ష కట్టడంతో వైయస్ కుటుంబానికి సపోర్ట్ గా నిలిచారు. 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరారు. 2014 , 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.ఆయన 2019లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల, భూగర్భ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గ్రామ సచివాలయ, వాలంటీర్ల శాఖ భాద్యతలను 21 సెప్టెంబర్ 2020న ప్రభుత్వం అప్పగించింది.
 

click me!