భూమా అఖిల ప్రియ: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

By Rajesh KarampooriFirst Published Mar 26, 2024, 6:52 AM IST
Highlights

Bhuma Akhila Priya Biography: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభ గారి ఆకస్మిక మరణం తరువాత వచ్చిన ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వారే భూమా అఖిలప్రియ. ఆమె అతి చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టి.. పర్యాటక, తెలుగు భాష, సాంస్కృతిక శాఖల మంత్రిగా సేవలందించారు.  ఆమె వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు మీ కోసం.. 

Bhuma Akhila Priya Biography: ఏపీ రాజకీయాల్లో భూమా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. భూమా నాగిరెడ్డి గారు మూడు సార్లు నంద్యాల ఎంపీగా,  ఒకసారి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా సేవలందిస్తే,  ఆయన సతీమణి శోభారెడ్డి ఏకంగా ఐదుసార్లు ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే.. 2014లో శోభ గారి ఆకస్మిక మరణం తరువాత ఆళ్లగడ్డ ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వారే భూమా అఖిలప్రియ. అతి చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆమె పర్యాటక, తెలుగు భాష, సాంస్కృతిక శాఖల మంత్రిగా సేవలందించారు. అఖిలప్రియ. ఆమె వ్యక్తిగత, రాజకీయ జీవితం, విశేషాలు మీ కోసం. 
 
బాల్యం, కుటుంబ నేపథ్యం

భూమా అఖిలప్రియ.. 1987 ఏప్రిల్ 2న భూమా నాగిరెడ్డి-శోభ గార్ల దంపతులకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జన్మించారు. ఆమెకి ఒక చెల్లి నాగమూలిక, తమ్ముడు జగత్ రెడ్డి. నాగిరెడ్డి గారి కుటుంబం రాజకీయాల్లో ఉండటంతో వారికి ప్రత్యర్థులు కూడా ఎక్కువే. అలాగే.. నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఫ్యాక్షన్ నేపథ్యం పిల్లలపై ఆ ప్రభావం పడకుండా భూమా దంపతులు జాగ్రత్తపడ్డారు. అలా వారు తన పిల్లల్ని ఆళ్లగడ్డకు దూరంగా ఉంచి చదివించారు. 

విద్యాభ్యాసం

ప్రాథమిక విద్య హైదరాబాద్ లోని భారతి విద్యా భవన్ జరగగా, ఊటీలోని లారెన్స్ హైస్కూల్ హైస్కూల్ ఎడ్యూకేషన్. ఇంటర్మీడియట్ హైదరాబాద్ లోని మేరీస్ జూనియర్ కాలేజీ    లో చదివింది. అనంతరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ లో బిజినెస్ మేనేజ్మెంట్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత కొంతకాలం పాటు ఆస్ట్రేలియాలో కూడా చదును కొనసాగించారు అఖిలప్రియ. తన తల్లిదండ్రుల నుంచి ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ధైర్యంగా నిబ్బరంగా ఎలా ఉండాలో కూడా నేర్చుకున్నారు. కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డింద్రనాథ్ రెడ్డి కుమారుడు రామానుజన్ రెడ్డితో 2010లో అఖిలప్రియ గారికి వివాహం అయింది. కానీ,పెళ్లైన ఏడాది లోపే వారి మధ్య తీవ్రమైన విభేదాలు రావడంతో విడిపోయారు.  

రాజకీయ జీవితం

అఖిలప్రియ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా.. ఓ కార్యకర్తగానే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తొలినాళ్లలో తన తల్లిదండ్రుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అఖిలప్రియ మొదట్లో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కానీ, క్రమంగా పరిస్థితులను అర్థం చేసుకుంటూ ప్రజలతో మమేకమైంది. ఇదిలా ఉంటే.. 2014 ఏప్రిల్ 23న భూమా శోభ రోడ్డు ప్రమాదం  మరణించారు. దీంతో ఆమె దిగ్బాంత్రికి లోనయ్యారు. తల్లి మరణంతో ఖాళీ అయిన ఆళ్ళగడ్డ శాసనసభా స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ తరపున పోటిలో నిలిచి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు.అలా తొలిసారి  శాసనసభలో అడుగు పెట్టారు. 

టీడీపీలో చేరిక 

పలు రాజకీయ కారణాలతో 2016లో అఖిల ప్రియ తన తండ్రి భూమా నాగి రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు తన మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆమెకు పర్యాటక, తెలుగు భాష, సాంస్కృతిక శాఖను అప్పగించారు. ఈ నేపథ్యంలో మరో ఆమె జీవితంలో మరో విషాదం చోటుచేసుకుంది. తన తండ్రి భూమ నాగిరెడ్డి 2017 మార్చి 12న గుండెపోటుతో మరణించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో పాటు ఆయన తనయుడు లోకేష్ తో కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. ఆయన్ని అన్నయ్యగా భావించి అఖిలప్రియ.. తెలుగుదేశం పార్టీలోకి రాకముందు నుంచే పరిచయం. అలాగే.. నారా బ్రాహ్మణి, అఖిలప్రియ ఇద్దరు క్లాస్మేట్స్. 

వివాహం

అఖిలప్రియ మంత్రిగా ఉండగానే 2018 మే 12న మద్దూర్ భార్గవ్ రామ్ తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. అయితే.. నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో వీరి పెళ్లి వాయిదా పడింది. కానీ, తల్లిదండ్రులను కోల్పోయిన అఖిలప్రియ కుటుంబానికి అండగా నిలిచారు. 2018 ఆగస్టు 29న వివాహ బంధంతో అఖిల ప్రియ, భార్గవ్ రావ్ ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే.. 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన అఖిలప్రియ.. వైసీపీ హవా కారణంగా ఓడిపోయారు.

వివాదాలు

రాజకీయాల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి భూమా అఖిలప్రియ ఎన్నో ఆరోపణలు, ఇబ్బందులు, దాడులు ఎదురైనా కూడా ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అయితే 2023 మే 16న నారా లోకేష్ పాదయాత్రలో నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామంలో ఏవి సుబ్బారెడ్డి గారిపై అఖిలప్రియ తన అనుచరులతో కలిసి దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ తో సహా మొత్తం 11 మంది పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. 
 

click me!