వంగలపూడి అనిత: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

Published : Mar 26, 2024, 03:45 AM IST
వంగలపూడి అనిత: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

సారాంశం

Vangalapudi Anitha Biography: ఆమె ఉన్నత విద్యావంతురాలు, పైగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. కానీ, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తాను చేసే గౌరవప్రదమైన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. ఉన్నత ఆశయాతో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. నేడు ఆ పార్టీకే ఆమె గొంతుగా మారారు. ఆమెనే  విశాఖ జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత. ఆమె వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు మీకోసం.. 

 Vangalapudi Anitha Biography:

బాల్యం, విద్యాభాస్యం: 

వంగలపూడి అనిత .. 1979 జనవరి 1న విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలంలోని లింగరాజుపాలెం గ్రామంలో వంగలపూడి అప్పారావు గారి దంపతులకు జన్మించారు. అనిత తండ్రి అప్పారావు గారు గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్. అనిత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. చిన్న వయస్సులోనే ప్రభుత్వం టీచర్ గా ఉద్యోగం రావడంతో  ఉద్యోగం చేస్తూనే 2009లో ఆంధ్ర యూనివర్సిటీ కరస్పాండెంట్ కోర్సులో ఎంఎస్సీ పూర్తి చేశారు. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎం.ఈ.డి  పూర్తి చేశారు.

ఆమె దాదాపు 12 సంవత్సరాల పాటు ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులపై స్థానిక నేతలను ప్రశ్నించేది. రాజకీయాలపై ఆసక్తితో 34 సంవత్సరాల వయసులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా రాజీనామా చేసి రాజకీయాలు అడుగు పెట్టారు. అనిత డిగ్రీలో ఉండగానే వాళ్ళ అన్నయ్య గారికి స్నేహితుడైన కొసర శివప్రసాద్ పరిచయం కావడం అది ప్రేమగా మారడం పెద్దలను ఎదిరించి పోలీస్ స్టేషన్లో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత అదే పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒక కేసులు పెట్టుకొని ఆ తర్వాత డైవర్స్ కూడా అప్లై చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె.

రాజకీయ ప్రవేశం 

>> 2012లో గ్రామస్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టిన అనిత. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా మారారు.  తన వాగ్దాటితో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అలా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆమెను ప్రోత్సహించారు. అలా 2014 ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించారు.  ఆ ఎన్నికల్లో సమీప వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెంగల వెంకటరావు పై 2,828 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టింది.

>> ఆమె 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యురాలిగా నియమితురాలైంది. అయితే.. తన మతం గురించి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడంతో అనవసర వివాదాలు ఆస్కారం ఇవ్వకుండా ఆవిడ.. చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పదవి తనకు వద్దని సునితంగా ఆ సమస్యను పరిష్కరించారు. 

>> 2017లో అనితకి, వైసీపీ ఎమ్మెల్యే రోజా మధ్య జరిగిన వాగ్వాదం అప్పట్లో సంచలనమైంది. వైసీపీ ఎమ్మెల్యే రోజా..అనితను ఉద్దేశిస్తూ..  నేనేమీ నీలా మొగును కొట్టి పోలీస్ స్టేషన్కు వెళ్లలేదని వివాదా కామెంట్స్ చేసింది. ఆ వ్యాఖ్యలతో అనిత కన్నీటి పర్యంతమైంది. ఈ నేపథ్యంలో రోజాపై సస్పెన్షన్ వేయాలని అప్పటి సభాపతి కోడెల శివప్రసాదరావు గారిని అడగడం. దానిపై స్పందించిన సభాపతి.. రోజాను  సంవత్సరం పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పట్లో ఈ  ఘటన సంచలనం సృష్టించింది.

>> ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిస్థితుల్లో కారణంగా చంద్రబాబు గారు పాయకరావుపేట నుంచి కాకుండా కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనితను ఆదేశించారు. అధినేత ఆదేశాన్ని పాటించిన ఆమె. కొవ్వూర్ నుంచి పోటీ చేసి 25,248 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో వైసిపి ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించగా తెలుగుదేశం కేవలం 23 స్థానాలకే పరిమితం అయింది.

>> ఇక 2021 జనవరి 30న ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా అనిత నియమించారు. చంద్రబాబు తనపై అధినేత పెట్టుకున్న నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిలబెడుతూ తెలుగుదేశం పార్టీ గొంతుని ఎలుగెత్తి చాటుతూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు. 

>> 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం