అది కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాల్సిందే: నారా లోకేష్ వ్యంగ్యం

Published : Nov 21, 2018, 05:57 PM ISTUpdated : Nov 21, 2018, 06:54 PM IST
అది కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాల్సిందే: నారా లోకేష్ వ్యంగ్యం

సారాంశం

వ్యవసాయంలో ఎకరానికి కోటి రూపాయాలను సంపాదించడం ఎలానో తనకు తెలియదని ఏపీ  రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి   నారా లోకేష్  చెప్పారు


అమరావతి: వ్యవసాయంలో ఎకరానికి కోటి రూపాయాలను సంపాదించడం ఎలానో తనకు తెలియదని ఏపీ  రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి   నారా లోకేష్  చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద వ్యవసాయంలో ఎకరానికి కోటి రూపాయాలు సంపాదించడం ఎలానో నేర్చుకోవాలన్నారు.

బుధవారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ను చూసి వ్యవసాయం చేయడం నేర్చుకోవాలన్నారు. ఎకరానికి కోటి రూపాయాలను  వ్యవసాయం చేసి కేసీఆర్  సంపాదించినట్టు తాను విన్నానని లోకేష్ గుర్తు చేశారు. 

తనకు తెలిసి ఎకరానికి కోటి రూపాయాలు సాధ్యం కాదన్నారు. ఇలా సంపాదించడం ఎలా చెబితే ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర,కర్ణాటకకు చెందిన రైతులు కూడ సంపాదిస్తారని లోకేష్ చెప్పారు.

తాను కూడ అగ్రి వ్యాపారం చేశానన్నారు. కానీ, వ్యవసాయంలో ఎకరానికి కోటి రూపాయాల ఆదాయాన్ని సంపాదించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవసాయరంగంలో కోటి రూపాయాల ఆదాయాన్ని  సంపాదించడం నేర్చుకోవాలన్నారు. 

సంబంధిత వార్తలు

చంద్రబాబు కుటుంబం ఆస్తులివే: దేవాన్ష్ ఆస్తుల విలువ రూ. 18.72 కోట్లు


 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు