నా లెక్క నాకుంది: వైఎస్ జగన్ తో బిజెపి దోస్తీపై పవన్ కల్యాణ్

By telugu team  |  First Published Feb 15, 2020, 2:40 PM IST

బిజెపితో దోస్తీ విషయంలో తాను స్పష్టంగా ఉన్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు వైఎస్ జగన్ తో బిజెపి దోస్తీ కడుతుందనే వార్తలపై ఆయన స్పందించారు. జగన్ కలుస్తోంది ప్రభుత్వ పెద్దలనే అని ఆయన అన్నారు.


అమరావతి: బిజెపితో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దోస్తీ కడుతున్నారనే వార్తలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ప్రతిస్పందించారు. అమరావతి గ్రామాల్లో ఆయన శనివారం పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బిజెపి వైసీపీతో జత కడితే మీరేం చేస్తారంటూ మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు ఆయన స్పందించారు. 

త్వరలోనే బిజెపితో కలిసి ఉద్యమాలు చేస్తామని ఆయన చెప్పారు. జనసేన ఆటలో అరటి పండుగా మారిందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ఆయన నర్మగర్భంగా మాట్లాడారు. ప్రస్తుతానికి బిజెపి, జనసేన బంధం బలంగా ఉందని ఆయన చెప్పారు. 

Latest Videos

undefined

Also Read: జగన్ మాకు ప్రత్యర్థే, పవన్ కల్యాణ్ తోనే దోస్తీ: సునీల్ దియోధర్

భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసి ఉమ్మడి కార్యక్రమాలు తీసుకుంటాయని ఆయన చెప్పారు. ఢిల్లీలో జగన్ భారతీయ జనతా పార్టీ నేతలను కలవడం లేదని, భారత ప్రభుత్వ అధినేతలను కలుస్తున్నారని ఆయన చెప్పారు. అందువల్ల వేరే ఊహాగానాలు అవసరం లేదని ఆయన అనారు. 

రాజధాని విషయంలో స్పష్టత ఇచ్చిన తర్వాతనే తాను బిజెపి నేతలతో కలిసినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే బిజెపి నేతలతో కలిసి తాను అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని చెప్పారు. ఢిల్లీ శాసన సభ ఎన్నికలవల్ల గతంలో తలపెట్టిన ర్యాలీ జరగలేదని ఆయన చెప్పారు.

Also Read: జగన్ వద్దకు వెళ్లిందే వాళ్లే, మేం కాదు: పవన్ కల్యాణ్ తో రైతులు

కాగా, వైసీపీ తమకు రాజకీయ ప్రత్యర్థేనని బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ సునీల్ దియోధర్ స్పష్టం చేశారు. జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పారు.

click me!