డైరీలో నమోదు చేసుకున్నాడు: చంద్రబాబు మాజీ పీఎపై పార్థసారథి

By telugu teamFirst Published Feb 15, 2020, 1:49 PM IST
Highlights

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎ శ్రీనివాస రావు విషయంలో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అధికారిక కార్యక్రమాలు చూసుకోవాలి గానీ డైరీలో నమోదు చేయడమేమిటని ప్రశ్నించారు.

అమరావతి: ముఖ్యమంత్రి పీఏ కేవలం అధికారిక వ్యవహారాలను మాత్రమే చూడాల్సి ఉంటుందని, కానీ గత ముఖ్యమంత్రి పీఏ కాంట్రాక్టర్ల తో లావాదేవీలు డైరీలో నమోదు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ పీఎ శ్రీనివాస రావుపై జరిగిన ఐటీ దాడులను ప్రస్తావిస్తూ ఆయన ఆ విధంగా అన్నారు.

ఐటీ విభాగం ఇతర లావాదేవీలను కూడా పరిశీలించాలని, కాంట్రాక్టర్ల కోసమే చంద్రబాబుసోమవారం పోలవరం అనడానికి కారణమని ఇప్పుడు అర్ధం అవుతోందని ఆయన అన్నారు. అమరావతిని బంగారుగుడ్లు పెట్టె బాతుగా చూశారని ఆయన అన్నారు.  సీఎం జగన్ ఢిల్లీ వెళ్తే కూడా టీడీపీ ఏవేవో ఆరోపణలు చేస్తుండటం శోచనీయమని, ఆ పార్టీ దిగజారుడు తనానికి నిదర్శనమని ఆయన అన్నారు.

గతంలో చంద్రబాబు చేపట్టిన విధానాల కారణంగారాజధాని గ్రామాల్లో నివాసిత ప్రాంతాల్లో భూముల ధరలు పడిపోయాయని, ఖాళీగా ఉన్న భూములకు ఒక ఎఫ్ ఎస్ ఐ, నివాసిత భవనాలు ఉన్న భూముల్లో మరో ఎఫ్ఎస్ఐ ధర నిర్ణయం చేశారని అన్నారు. ఈ కారణంగా ఈ ప్రాంతంలో భూముల ధరలు  ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయని, రాజధాని ప్రాంతంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమని అన్నారు. వారిని వైసీపీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. 

రాజధాని ప్రాంతంలో జరుగుతున్నకృత్రిమ ఉద్యమంలో  రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా భాగస్వాములుగా ఉన్నారని ఆయన విమర్శించారు. గతంలో కోటి, రెండు కోట్లు పలికిన భూమి చంద్రబాబు చేసిన జోనింగ్ ప్రక్రియ కారణంగా దారుణంగా ధరలు పడిపోయాయని ఆయన అన్నారు.

మూడు రాజధానులు ప్రకటన కారణంగా కర్నూలు, శ్రీకాకుళం ప్రాంతంలో కూడా భూముల ధరలు పెరిగాయని పార్థసారథి చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం జీఎస్టీ , పెద్ద నోట్ల రద్దు వంటి కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొందని, ఇప్పటి పరిస్థితులు కారణం కాదని అన్నారు.

click me!