మళ్ళీ ఆ 'అమరావతి' కనిపించదా?

By Prashanth MFirst Published Jan 27, 2020, 10:06 AM IST
Highlights

అమరావతి లోగోని తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ వద్ద ఉన్న ఐ లవ్ అమరావతి సైన్ బోర్డు సడన్ గా మాయమయ్యింది. శనివారం వరకు కనిపించిన ఆ బోర్డు ఆదివారం నాటికి కనిపించలేదు. 

దేశ రాజధాని ఢిల్లీలో అమరావతి లోగోని తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ వద్ద ఉన్న ఐ లవ్ అమరావతి సైన్ బోర్డు సడన్ గా మాయమయ్యింది. శనివారం వరకు కనిపించిన ఆ బోర్డు ఆదివారం నాటికి కనిపించలేదు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త నేషనల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారింది.

చూపరులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఐ లవ్ అమరావతి సైన్ బోర్డును తొలగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అమరావతిని  రాజధానిగా నిర్ణయించినప్పుడు టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈ బోర్డును ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న మూడు రాజధానుల వివాదాల నడుమ ఈ చర్య మరీంత వైరల్ అయ్యేలా కనిపిస్తోంది.  గతంలో ఎప్పుడు లేని విధంగా నిర్వాహకులు ఈ విధంగా ఎందుకు చేశారనేది జనాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ భావనా సక్సేనా మాత్రం ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చారు. కోతుల కారణంగా బోర్డులో కొన్ని అక్షరాలు వెనక్కి వంగిపోయాయని అందుకే పూర్తిగా తొలగించమని అన్నారు. అలాగే మరమ్మత్తులు చేసేందుకు వాటిని తొలగించినట్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ బోర్డు సైన్ ని యధావిధిగా ఏర్పాటుచేస్తారా లేదా అన్నది అనుమానంగా మారింది.

click me!