నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు: పవన్ కళ్యాణ్

Published : Jan 04, 2019, 08:16 PM IST
నన్ను ఆపే శక్తి  ఎవరికీ లేదు: పవన్ కళ్యాణ్

సారాంశం

తాను ప్రవాహం లాంటి వాడినని... తనను ఎవరూ కూడ ఆపలేరని జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ చెప్పారు.ఒకటి రెండు కులాలను అడ్డు పెట్టుకొని  విజయం సాధించలేమని ఆయన  అభిప్రాయపడ్డారు.

అమరావతి: తాను ప్రవాహం లాంటి వాడినని... తనను ఎవరూ కూడ ఆపలేరని జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ చెప్పారు.ఒకటి రెండు కులాలను అడ్డు పెట్టుకొని  విజయం సాధించలేమని ఆయన  అభిప్రాయపడ్డారు.

శుక్రవారం నాడు అమరావతిలో  జనసేన కార్యకర్తలతో  పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు.  తూర్పుగోదావరి, పొట్టిశ్రీరాములు, నెల్లూరు జిల్లాల కార్యకర్తలతో  పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. 

కులం పేరు చెప్పి వ్యక్తులు లాభపడుతున్నారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాలు వచ్చే సలహాలు ఇవ్వాలని  పవన్ పార్టీ కార్యకర్తలను కోరారు. వ్యక్తిగతంగా పదివేల ఓట్లు వచ్చే వారిని  అక్కున చేర్చుకొంటామని పవన్ కళ్యాణ్ చెప్పారు.

కులం పేరు చెప్పి కొందరు వ్యక్తులు లాభపడుతున్నారని... కానీ కులాలు మాత్రం బాగుపడడం లేదన్నారు. బాధ్యత, ఓపిక, సహనం ఉంటేనే రాజకీయాల్లో రాణిస్తామని చెప్పారు.

ఓపిక, సహనం ఉంటేనే రాజకీయాల్లో రాణిస్తామన్నారు. చిన్ననాటి నుండి ఈ లక్షణాలు అలవర్చుకొని రాజకీయాల్లోకి వచ్చానని పవన్ ‌కళ్యాణ్ చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని  జనసేనను విస్తరించే ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అది పవన్ ఇష్టం: మరోసారి జనసేనానికి బాబు ఆఫర్

బాబు, పవన్ పొత్తు: శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు

జగన్‌కు చెక్: పవన్ తో దోస్తీకి బాబు ప్లాన్?

పవన్‌తో కలిసి పోటీ చేస్తే జగన్‌కు ఏం ఇబ్బంది: బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మోడీకి బాబు కౌంటర్: తెలంగాణలో బీజేపీ ఓడిపోతే మోడీకి ఎందుకు సంతోషం

బాబు ఓడిపోయాడు, కేసీఆర్ కూటమి తెలియదు: మోడీ సెటైర్లు

అప్పుడే రామ మందిరం, తెలంగాణలో గెలుస్తామని చెప్పలేదు: మోడీ

PREV
click me!

Recommended Stories

Constable Success Stories:వీళ్ళ ఎమోషనల్ మాటలు చూస్తే కన్నీళ్లు ఆగవు | Police | Asianet News Telugu
Bhumana Karunakar Reddy: దేవుడ్ని దోచి, ఒబెరాయ్ కు కట్టబెడుతున్న బాబు ప్రభుత్వం| Asianet News Telugu