జనసేన కార్యకర్తలపై దాడి.. మళ్లీ ఇలాంటివి జరిగితే, నేనే రోడ్ల మీదకు వస్తా: వైసీపీ సర్కార్‌కి పవన్ హెచ్చరిక

By Siva KodatiFirst Published Sep 5, 2021, 6:49 PM IST
Highlights

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జనసేన కార్యకర్తలపై జరిగిన  దాడిని  ఖండించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. మా నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తే సమస్య పెద్దదవుతుందని తప్ప పరిష్కారం కాదని పవన్ అన్నారు. జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తే తానే స్వయంగా రోడ్లపైకి వస్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. 

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జనసేన కార్యకర్తలపై జరిగిన  దాడిని  ఖండించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. రోడ్ల అధ్వాన్న స్థితిని తెలియజేస్తే దాడులు చేస్తారా అంటూ ఫైరయ్యారు. ఆముదాలవలసలో పోలీసుల సమక్షంలోనే దాడులు చేశారని పవన్ ఆరోపించారు. జనసేన నాయకుడు రామ్మోహన్ రావుపై దాడి చేశారని.. సమస్యలు తెలియజేసిన వారిపై దాడి చేసి కేసులు పెడతారా అంటూ జనసేనాని ఫైర్ అయ్యారు.

మా నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తే సమస్య పెద్దదవుతుందని తప్ప పరిష్కారం కాదని పవన్ అన్నారు. జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తే తానే స్వయంగా రోడ్లపైకి వస్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. అలాంటి పరిస్ధితులు తీసుకురావొద్దని ఆయన కోరారు. అందరికీ సమన్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నానని.. ఇకనైనా దాడులు ఆపి ప్రజా సమస్యలపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని పవన్ కల్యాణ్ హితవు పలికారు. 

Also Read:స్పీకర్ తమ్మినేని ఇలాకాలో వివాదం... జనసేన అసెంబ్లీ ఇంచార్జిపై వైసిపి శ్రేణుల దాడి

అంతకుముందు జనసేన పార్టీ పిలుపుమేరకు అసెంబ్లీ  స్పీకర్ తమ్మినేని సీతారాం సొంత నియోజకవర్గం ఆముదాలవలసలో అధ్వాన్నంగా మారిన రోడ్లను ఫోటోలు తీసి ఓ భారీ ప్లెక్సీని ఏర్పాటుచేసారు జనసేన నాయకులు. అయితే ఆ ప్లెక్సీలో స్పీకర్ తమ్మినేని ఫోటోను కూడా వాడటంతో జనసేన-వైసిపిల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలోనే జనసేన నియోజకవర్గ ఇంచార్జిపై వైసిపి నాయకులు దాడికి పాల్పడ్డారు. 

click me!