ఏపీలో అంతకంతకూ విజృంభిస్తోన్న కరోనా... కొత్తగా 1623 మందికి పాజిటివ్, తూ.గోలో విలయతాండవం

Siva Kodati |  
Published : Sep 05, 2021, 06:17 PM ISTUpdated : Sep 05, 2021, 06:22 PM IST
ఏపీలో అంతకంతకూ విజృంభిస్తోన్న కరోనా... కొత్తగా 1623 మందికి పాజిటివ్, తూ.గోలో విలయతాండవం

సారాంశం

ఏపీలో కొత్తగా 1623 కరోనా కేసులు నమోదవ్వగా.. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,340 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 15,158 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో రెండు రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,623 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,18,430కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,911కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల చిత్తూరులో 2, గుంటూరు 1, ప్రకాశం 1, కృష్ణ 2, నెల్లూరు 1, పశ్చిమ గోదావరిలలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,340 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,89,361కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 65,596 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,69,39,087కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 15,158 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 17, చిత్తూరు 276, తూర్పుగోదావరి 342, గుంటూరు 151, కడప 83, కృష్ణ 148, కర్నూలు 16, నెల్లూరు 194, ప్రకాశం 114, శ్రీకాకుళం 32, విశాఖపట్నం 60, విజయనగరం 42, పశ్చిమ గోదావరిలలో 148 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

Vemireddy Prashanthi Emotional Speech In Mahanadu | వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు
Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్