విజయసాయిపై లెక్కలేనన్ని ఫిర్యాదులు.. టోల్‌ ఫ్రీ నెంబర్ పెట్టాలేమో: రఘురామ సంచలనం

Siva Kodati |  
Published : Sep 05, 2021, 04:13 PM ISTUpdated : Sep 05, 2021, 04:14 PM IST
విజయసాయిపై లెక్కలేనన్ని ఫిర్యాదులు.. టోల్‌ ఫ్రీ నెంబర్ పెట్టాలేమో: రఘురామ సంచలనం

సారాంశం

విశాఖలో రఘురామ కృష్ణంరాజు వంద కోట్ల విలువైన భూమిని ఆక్రమించారంటూ తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. విశాఖలో స్థలాలు కలిగిన ఎన్నారైలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. విజయసాయిరెడ్డిపై లెక్కకుమిక్కిలిగా వస్తున్న ఫిర్యాదుల స్వీకరణకు ఒక టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేయాలని రఘురామ సెటైర్లు వేశారు.  

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఆయనపై తీవ్రస్థాయిలో ఫిర్యాదులు వస్తున్నాయని రఘురామ ఆరోపించారు. విశాఖలో వంద కోట్ల విలువైన భూమిని ఆక్రమించారంటూ తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు. విశాఖలో స్థలాలు కలిగిన ఎన్నారైలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విజయసాయిరెడ్డిపై లెక్కకుమిక్కిలిగా వస్తున్న ఫిర్యాదుల స్వీకరణకు ఒక టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేయాలని రఘురామ సెటైర్లు వేశారు.

ఇటీవల విజయసాయి స్పందిస్తూ తన పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నవారిపై ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేయాలని సూచించారు. దీనిపై రఘురామ పైవిధంగా వ్యాఖ్యానించారు. విజయసాయిపై వచ్చే ఫిర్యాదులను పారదర్శకరీతిలో విచారణ చేయాలని ఆయన  డిమాండ్ చేశారు. అసలు, విజయసాయిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు నియంత్రించడంలేదని రఘురామ ప్రశ్నించారు

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు