చంద్రబాబు, జగన్ లతోనే దోబూచులాట, నాతో కాదు: పవన్ కళ్యాణ్

Published : Jan 10, 2019, 05:23 PM IST
చంద్రబాబు, జగన్ లతోనే దోబూచులాట, నాతో కాదు: పవన్ కళ్యాణ్

సారాంశం

పోరాటం చేసేవారికి గెలుపు ఎప్పుడూ సిద్ధిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తోందని చెప్పుకొచ్చారు. గురువారం విజయవాడలోని కడప నియోజకవర్గానికి చెందిన నేతలతో సమావేశం నిర్వహించిన పవన్ గెలుపు కోస‌మే ప‌ని చేసే వారితో గెలుపు దోబూచులాడుతుందన్నారు. 

విజయవాడ: పోరాటం చేసేవారికి గెలుపు ఎప్పుడూ సిద్ధిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తోందని చెప్పుకొచ్చారు. గురువారం విజయవాడలోని కడప నియోజకవర్గానికి చెందిన నేతలతో సమావేశం నిర్వహించిన పవన్ గెలుపు కోస‌మే ప‌ని చేసే వారితో గెలుపు దోబూచులాడుతుందన్నారు. 

తాను ముఖ్యమంత్రి కావాలని ఓ వైపు జగన్ ప్రయత్నిస్తుంటే... మరోవైపు తానే మళ్లీ సీఎం కావాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని పవన్ స్పష్టం చేశారు. అందువల్లే వారితో గెలుపు దోబూచులాడుతోందని చెప్పుకొచ్చారు. 

అధికారం కోసం ఆలోచించే వారికి ప్ర‌జా సంక్షేమం ప‌ట్ల చిత్త‌శుద్ది ఉండ‌దన్నారు. అందుకు చరిత్ర చెబుతున్న పాఠాలే నిదర్శనమన్నారు. పాలిటిక్స్ తనకు వ్యాపారం కాదన్నారు పవన్ కళ్యాణ్. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏ జిల్లాలో చూసినా రాజ‌కీయం కొన్ని కుటుంబాల చేతిలోనే ఉండిపోయిందన్నారు. 

రాజకీయ కుటుంబాలు స్వ‌లాభం కోసం రాజ‌కీయాలు చేస్తూ ప్ర‌జా సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని ఆరోపించారు. రెండు రాజ‌కీయ ప‌క్షాల‌తో ద‌శ‌, దిశ లేకుండా పోతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు దిశానిర్ధేశం చేయ‌క‌పోతే త‌ప్పు చేసిన వారిమ‌వుతామ‌ని భావించి మూడో ప‌క్షంగా జ‌న‌సేన‌ను స్థాపించినట్లు తెలిపారు. వ్య‌వ‌స్థ‌ను రాత్రికి రాత్రే మార్చ‌లేమ‌న్న తనకు తెలుసునని అందుకే ఓర్పు, సహనంతో రాజకీయాలు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ చంపేయ్, చింపేయ్ అంటాడు: పవన్ కళ్యాణ్

అందుకే జనసేన పార్టీ ఆవిర్భవించింది : పవన్ కళ్యాణ్

యువ శక్తి రాజకీయ శక్తిగా మారాలి, నేను మారుస్తా: పవన్ కళ్యాణ్

రాజకీయాల్లో అలాంటి నాయకుడు ఒక్కరూ లేరు: పవన్ ఆవేదన

 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!