తండ్రి బాటలోనే తిరుమల కొండపైకి వైఎస్ జగన్

Published : Jan 10, 2019, 05:08 PM ISTUpdated : Jan 10, 2019, 08:22 PM IST
తండ్రి బాటలోనే  తిరుమల కొండపైకి వైఎస్ జగన్

సారాంశం

కాలినడకన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ గురువారం సాయంత్రం తిరుమల కొండపైకి చేరుకొన్నారు.

తిరుమల: కాలినడకన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ గురువారం సాయంత్రం తిరుమల కొండపైకి చేరుకొన్నారు.

పాదయాత్రను ముగించుకొన్న వైఎస్ జగన్  ఇవాళ ఉదయం తిరుపతికి చేరుకొన్నారు. అలిపిరి మీదుగా కాలినడకన జగన్ తిరుమలకు చేరుకొన్నారు.మధ్యాహ్నం 1:44 నిమిషాలకు అలిపిరి నుండి వైఎస్ జగన్‌ కాలినడకన తిరుమలకు చేరుకొన్నారు. సాధారణ భక్తుడి మాదిరిగానే జగన్  తిరుమల వెంకటేశ్వరస్వామిని సందర్శించుకోనున్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పాదయాత్రను నిర్వహించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్రను ముగించుకొన్న తర్వాత తిరుమలలో శ్రీవారిని దర్శించుకొన్నారు. కాలినడకనే ఆ సమయంలో కూడ వైఎస్ఆర్ కూడ తిరుమల కొండపైకి వచ్చాడు. 

తండ్రి తరహాలోనే జగన్ కూడ తిరుమల కొండపైకి కాలినడకన కొండపైకి చేరుకొన్నాడు. శ్రీవారిని దర్శించుకొన్న తర్వాత జగన్ విశాఖకు బయలుదేరే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

Constable Success Stories:వీళ్ళ ఎమోషనల్ మాటలు చూస్తే కన్నీళ్లు ఆగవు | Police | Asianet News Telugu
Bhumana Karunakar Reddy: దేవుడ్ని దోచి, ఒబెరాయ్ కు కట్టబెడుతున్న బాబు ప్రభుత్వం| Asianet News Telugu