ఫార్మింగ్టన్ వర్సిటీ వివాదం: పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

Published : Feb 02, 2019, 07:53 AM ISTUpdated : Feb 02, 2019, 07:58 AM IST
ఫార్మింగ్టన్ వర్సిటీ వివాదం: పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

సారాంశం

అమెరికా దేశానికి ఎంఎస్‌ చదివేందుకు వెళ్లి కేసుల్లో చిక్కుకోవడంతో వారి కన్నవారు ఆందోళనలో ఉన్నారని పవన్ కల్యాణ్ అన్నారు. అరెస్ట్ అయినవారిలో ఎక్కువమంది తెలుగువారు ఉన్నారనే వార్తలు బాధను కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. 

హైదరాబాద్: ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయం వివాదంలో అరెస్టయిన భారతీయ విద్యార్థులను తక్షణం విడుదల చేయించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశఆరు. అమెరికాలో ఇమిగ్రేషన్‌ అధికారుల అదుపులో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన న్యాయ సహాయం అందించి విడుదల చేయించేందుకు  అవసరమైన చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం తీసుకోవాలని కోరారు. 

అమెరికా దేశానికి ఎంఎస్‌ చదివేందుకు వెళ్లి కేసుల్లో చిక్కుకోవడంతో వారి కన్నవారు ఆందోళనలో ఉన్నారని పవన్ కల్యాణ్ అన్నారు. అరెస్ట్ అయినవారిలో ఎక్కువమంది తెలుగువారు ఉన్నారనే వార్తలు బాధను కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. అమెరికా ప్రభుత్వమే మిషిగన్ రాష్ట్రంలో నకిలీ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసి ట్రాప్ చేసి చేరిన విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం విచారకరమని అన్నారు. 

ఈ విషయంలో ఇబ్బందులుపడుతున్న విద్యార్థులకు అవసరమైన సాయాన్ని అందించాలని పవన్ కల్యాణ్ ఎన్నారై జనసేన ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కళాశాల దశ నుంచే అవగాహన శిబిరాలను నిర్వహించాల్సిన బాధ్యతను విద్యా శాఖతోపాటు కళాశాలలు తీసుకోవాలని అన్నారు.

సంబంధిత వార్తలు

యుఎస్ ఫేక్ వర్సిటీ: అమెరికాలో తెలంగాణ గర్భిణి అరెస్ట్

యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్: తెలుగువారిని ట్రాప్ చేశారిలా..?

ఫేక్ యూనివర్సిటీ కలకలం: తెలుగువారి కోసం రంగంలోకి తానా

అమెరికా ఫేక్ వర్సిటీ వలలో తెలుగు విద్యార్థులు: మోసగాళ్లలో 8 మంది తెలుగువాళ్లు వీరే

యూఎస్ ఫేక్ వర్సిటీ వివాదం: కేథరిన్ హడ్డాతో కేటిఆర్ చర్చలు

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం