సదావర్తి భూముల వేలం రద్దు...బెడిసికొట్టిన ‘ముఖ్యుల’ ప్లాన్-ఆళ్ళకే క్రెడిట్

First Published Oct 7, 2017, 6:50 AM IST
Highlights
  • సదావర్తి భూముల వేలాన్ని రద్దు చేయటం ద్వారా చంద్రబాబునాయుడుకు సుప్రింకోర్టు పెద్ద షాకే ఇచ్చింది.
  • సుప్రింకోర్టు తాజా ఆదేశాలతో భూముల వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చినట్లైంది.
  • అదే సమయంలో సదావర్తి సత్రం భూముల తమవే అన్న తమిళనాడు వాదనపై సరైన విచారణ జరపాల్సిందిగా హై కోర్టుకు సుప్రిం ఆదేశాలు ఇవ్వటం గమనార్హం.

సదావర్తి భూముల వేలాన్ని రద్దు చేయటం ద్వారా చంద్రబాబునాయుడుకు సుప్రింకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. సుప్రింకోర్టు తాజా ఆదేశాలతో భూముల వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చినట్లైంది. అదే సమయంలో సదావర్తి సత్రం భూముల తమవే అన్న తమిళనాడు వాదనపై సరైన విచారణ జరపాల్సిందిగా హై కోర్టుకు సుప్రిం ఆదేశాలు ఇవ్వటం గమనార్హం. ఆమధ్యే కూడా తమిళనాడు ప్రభుత్వం ఇదే వాదన వినిపించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, అప్పట్లో తమిళనాడు ప్రభుత్వ వాదనను సుప్రింకోర్టు తోసిపుచ్చింది. అయితే అదే  సుప్రింకోర్టు ఈరోజు తమిళనాడు ప్రభుత్వం వేసిన తాజా పిటీషన్ను విచారణకు స్వీకరించటం గమనార్హం.

మొత్తం మీద భూముల వ్యవహారం వెనుక ఏదో గూఢుపుఠాణి జరిగిందన్న అనుమానాలైతే సుప్రింకోర్టుకు కూడా కలిగిందన్నది వాస్తవం. అందుకనే, మొదటి బిడ్డర్ వేలం పాట నుండి తప్పుకోగానే రెండో బిడ్డర్ సీన్ లోకి వచ్చారు. అయితే, సుప్రింకోర్టు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రెండో బిడ్డర్ కట్టిన డబ్బును తిరిగి ఇచ్చేయాలంటూ దేవాదాయ శాఖను ఆదేశించింది. చట్ట ప్రకారం భూములు సొంతం చేసుకోవటానికి అర్హత కలిగిన రెండో బిడ్డర్ నుండి తీసుకున్న డబ్బును కూడా వాపసు ఇచ్చేయమని ఆదేశించిందంటే ఏమని అర్ధం.

తమిళనాడు తాజా పిటీషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రింకోర్టు, ముందు ఆ భూములపై తమిళనాడుకున్న హక్కులను తేల్చమని స్పష్టంగా హై కోర్టును ఆదేశించింది. దాంతో భూముల వ్యవహారం ఇప్పట్లో తేలేది కాదన్న విషయం అర్ధమైపోతోంది. వందల కోట్ల రూపాయల విలువైన భూములను రూ. 22 కోట్లకే కొట్టేదామనుకున్న ప్రభుత్వ ముఖ్యుల ప్లాన్ సుప్రింకోర్టు తాజా ఆదేశాలతో బెడిసికొట్టినట్లే. హోలు మొత్తం మీద సదావర్తి భూముల వ్యవహారంలో వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డికే క్రెడిట్ దక్కుతుందనటంలో ఎవరికీ సందేహం అక్కర్లేదు.

 

click me!