వ్యక్తిగత హాజరు నుండి మినహాయించండి...కోర్టులో జగన్ పిటీషన్

Published : Oct 06, 2017, 05:22 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
వ్యక్తిగత హాజరు నుండి మినహాయించండి...కోర్టులో జగన్ పిటీషన్

సారాంశం

ఆరుమాసాల పాటు సాగే పాదయాత్ర వల్ల ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరుకాలేనని పిటీషన్లో చెప్పుకున్నారు.

‘‘పాదయాత్ర సందర్భంగా వ్యక్తిగత హాజరు నుండి మినహాయించండి’’ ...ఇది వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు తాజాగా చేసుకున్న విజ్ఞప్తి. శుక్రవారం నాడు జగన్ సిబిఐ కోర్టులో ఓ పిటీషన్ వేసారు. నవంబర్ 2వ తేదీ నుండి రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఆరుమాసాల పాటు సాగే పాదయాత్ర వల్ల ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరుకాలేనని పిటీషన్లో చెప్పుకున్నారు. కాబట్టి వ్యక్తిగత హాజరు నుండి మినహాయించాలంటూ విజ్ఞప్తి చేసారు. జగన్ పిటీషన్ పై వచ్చే శుక్రవారం విచారణ జరపాలని కోర్టు నిర్ణయిచింది.

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో దంచికొట్టనున్న వర్షాలు
పెట్రోల్ వాహ‌నాల‌ను ఈవీలు మార్చే టెక్నాల‌జీపై ఫోకస్.. చంద్ర‌బాబు కీలక సూచన